2019 సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముందు రోజు బంగాల్ మరోసారి భగ్గుమంది. శనివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు భాజపా కార్యకర్తలపై దాడి జరిగింది. ఇందులో ఓ కార్యకర్త మృతి చెందాడు.
జాడ్గ్రామ్లోని గోపిబళ్లాపుర్ ప్రాంతంలో రమణ్‌సింగ్ అనే భాజపా కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నేడు ఈ ప్రాంతంలో పోలింగ్ జరుగుతోంది.
తూర్పు మేధినీపుర్లోని భగవాన్‌పుర్ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో అనంత గుచైత్, రంజిత్ మైతి అనే ఇద్దరు భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిగాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆరో విడత పోలింగ్ కోసం 770 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు.
- ఇదీ చూడండి: భారత్‌లో ఐసిస్ ఉగ్రసంస్థ కొత్త బ్రాంచ్..!