ఉత్తర్‌ప్రదేశ్ న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు దార్వేశ్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆగ్రాలో మనీష్శర్మ అనే న్యాయవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండ్రోజుల క్రితమే యూపీ బార్‌కౌన్సిల్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు దార్వేశ్.
ఆమె గౌరవార్థం ఆగ్రా సివిల్‌కోర్టు ప్రాంగణంలో బుధవారం సభ నిర్వహించారు. సభ జరుగుతుండగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు దార్వేశ్ సింగ్‌పై మనీష్ మూడురౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత తనకు తాను కాల్చుకున్నాడు మనీష్.
ప్రస్తుతం మనీష్శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మనీష్ ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.