ETV Bharat / bharat

నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట

author img

By

Published : Dec 14, 2020, 10:59 AM IST

Updated : Dec 14, 2020, 12:16 PM IST

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. దిల్లీ సరిహద్దుల్లో సోమవారం ఉదయం 8 గంటలకు నిరాహా దీక్ష చేపట్టారు రైతన్నలు. హస్తిన సహా.. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దీక్షలు జరుగుతాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు.

Agitating farmers begin day long fast to intensify protest against farm law
హస్తిన సరిహద్దుల్లో రైతన్నల నిరాహార దీక్ష

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తోన్న అన్నదాతలు సోమవారం తమ పోరును మరింత ఉద్ధృతం చేశారు. ఆందోళనలో భాగంగా నేడు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరశన దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు.

దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్‌ సరిహద్దులోని ఘాజీపుర్‌ రహదారిపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ సహా ఇతర నాయకులు, రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అటు హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద కూడా అన్నదాతల నిరశన దీక్ష కొనసాగుతోంది. దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నేడు దీక్షలు జరుగుతాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి: 'కేంద్రాన్ని మేల్కొలిపేందుకే నిరాహార దీక్ష'

కేజ్రీవాల్‌ దీక్ష.. ఓ వంచన

అన్నదాతలకు మద్దతు ప్రకటించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. సోమవారం దేశ రాజధానిలో తానూ దీక్షలో పాల్గొంటానని వెల్లడించారు. దీనిపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రైతులపై కేజ్రీవాల్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. "కేజ్రీవాల్‌ జీ.. మీరు చేస్తున్నది వంచన. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే ఏపీఎంసీ చట్టంలో సవరణలు చేస్తామని అప్పట్లో మీరు హామీ ఇచ్చారు. 2020 నవంబరులో దిల్లీలో వ్యవసాయ చట్టాలపై నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ రోజు రైతుల కోసం దీక్ష చేస్తానంటున్నారు. ఇదంతా కపట ప్రేమ కాకపోతే మరేంటీ?" అని జావడేకర్‌ దుయ్యబట్టారు.

హరియాణా-రాజస్థాన్‌ సరిహద్దు మూసివేత

రైతుల ఆందోళనల నేపథ్యంలో హరియాణా-రాజస్థాన్‌ సరిహద్దును పోలీసులు మూసివేశారు. దిల్లీకి రైతులు రాకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దిల్లీ-నోయిడా మార్గం మీద ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించేందుకు రైతు సంఘాలు ఒప్పుకోవడం అంతర్గత విభేదాలకు దారితీసింది. కేంద్రమంత్రులు అభ్యర్థన మేరకు నోయిడా మార్గంలో శిబిరాలను రైతులు తొలగించారు. దీన్ని కొందరు అన్నదాతలు వ్యతిరేకించారు.

ఇవీ చదవండి:

కర్షకుల ఆందోళనలో కదం తొక్కిన మహిళలు

రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు 323 కిమీ పరుగు!

Last Updated : Dec 14, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.