కరోనా వైరస్ భారతదేశాన్ని కలవరపెడుతున్న వేళ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పరీక్షల నిర్వహణలో దూకుడు చూపించకపోతే.. వైరస్ విసురుతున్న సవాళ్లను దేశం ఎదుర్కోలేదని హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు సింగ్.
-
Testing & Tracing are the key to fight #COVID19
— Congress (@INCIndia) April 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Humanism, Protection & Financial Security must drive our approach to dealing with migrant labourers.
This is the only way ahead.
Dr. Manmohan Singh, Shri @RahulGandhi & others deliberate on these issues. pic.twitter.com/1BhKc45ZL3
">Testing & Tracing are the key to fight #COVID19
— Congress (@INCIndia) April 26, 2020
Humanism, Protection & Financial Security must drive our approach to dealing with migrant labourers.
This is the only way ahead.
Dr. Manmohan Singh, Shri @RahulGandhi & others deliberate on these issues. pic.twitter.com/1BhKc45ZL3Testing & Tracing are the key to fight #COVID19
— Congress (@INCIndia) April 26, 2020
Humanism, Protection & Financial Security must drive our approach to dealing with migrant labourers.
This is the only way ahead.
Dr. Manmohan Singh, Shri @RahulGandhi & others deliberate on these issues. pic.twitter.com/1BhKc45ZL3
''కొవిడ్ పరీక్షల నిర్వహణలో ఎన్నో సమస్యలున్నాయి. మరింత దూకుడుగా టెస్టులు నిర్వహించకుంటే.. ఈ మహమ్మారిని ఎదుర్కోలేం.''
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
పరీక్షలు చేయడం, రోగుల జాడ కనుక్కోవడమే కరోనాపై విజయానికి కీలకమని వ్యాఖ్యానించారు మన్మోహన్.
కమిటీ సభ్యులతో వీడియో..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ అమలుతో. క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు సమస్యల పరిష్కారానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓ సంప్రదింపుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులంతా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వీటినే వీడియో రూపంలో పొందుపరిచిన కాంగ్రెస్.. ఇవాళ విడుదల చేసింది.
వలస కూలీల సమస్యల పరిష్కారంలో మానవతావాదం, రక్షణ, ఆర్థిక భద్రత కీలకమని కొందరు కాంగ్రెస్ నేతలు సూచించారు. వలసవాదుల రక్షణ కోసం.. విస్తృత కార్యచరణ అవసరమని అభిప్రాయపడ్డారు అగ్రనేత రాహుల్ గాంధీ.
'ప్రభుత్వం విఫలం'
కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. దేశ ప్రజల రక్షణ కోసం... తామంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వ్యాఖ్యానించారు.
చివరగా.. చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కార మార్గం దొరుకుతుందని కాంగ్రెస్ నమ్ముతున్నట్లు వీడియోలో పేర్కొంది.