హింసకు తబ్లీగీ జమాత్ పూర్తిగా వ్యతిరేకమని ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా మహ్మద్ సాద్ ఖందల్వీ పేర్కొన్నారు. ఓ అంతర్జాతీయ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.
తబ్లీగీ జమాత్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను మహ్మద్ సాద్ ఖండించారు. లక్షలమంది సభ్యులున్న జమాత్.. ప్రపంచ దేశాల నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోలేదని తెలిపారు. తమకు ఉగ్రవాదంతో సంబంధం ఉండుంటే.. ఈ పాటికే నిఘా వ్యవస్థలు గుర్తించేవన్నారు.
"అసలు ఈ ప్రశ్నే సరైనది కాదు. దీనితో పాటు మీరు మన నిఘా వ్యవస్థల సామర్థ్యాన్ని అనుమానిస్తున్నారు. జమాత్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. మేము ఏం చేస్తున్నామో అధికారులకు తెలుసు. ప్రవక్తను అనుసరించడానికి నిత్యం కృషి చేస్తాం. మానవాళి పట్ల దయాగుణం ఉండాలన్నది మా సందేశం."
--- మౌలానా సాద్, తబ్లీగీ జమాత్ అధ్యక్షుడు.
ఈ నేపథ్యంలో మీడియాపై మండిపడ్డారు సాద్. అసలు తమ వాలంటీర్లు ఎలాంటి రాజకీయ, పౌర కార్యక్రమాల్లో పాల్గొనరని.. అయినా ప్రభుత్వ సంస్థలు అడిగిన ప్రతిసారీ తాము పూర్తిగా సహకరించామన్నారు. పత్రికలు, మీడియా తమ ఇష్టానుసారంగా రాసుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదని మండిపడ్డారు.
కరోనాపై...
దేశంలో కరోనా విజృంభణకు కారణమైన తబ్లీగీలకు మౌలానా సాద్ అండగా నిలిచారు. ఎందరో సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇదీ చూడండి:- కరోనాపై పోరుకు సహకరించాలని తబ్లీగీ అధినేత పిలుపు