ETV Bharat / bharat

ఎన్డీఏది రెండు ఇంజిన్ల ప్రభుత్వం: మోదీ

author img

By

Published : Nov 1, 2020, 10:49 AM IST

Updated : Nov 1, 2020, 11:38 AM IST

బిహార్​లో గెలుపెవరిదో మొదటి విడత పోలింగ్​తోనే తేలిపోయిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నితీశ్ కుమార్​ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. ఎన్డీఏది రెండు ఇంజిన్ల శక్తిమంతమైన ప్రభుత్వమన్నారు. మరోవైపు మహాకూటమిలోని ఇద్దరు యువరాజులు సింహాసనం కోసం పోరాడుతున్నారని రాహుల్​, తేజస్వీలనుద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు.

After the first phase voting, is it clear that Nitish Kumar is all set to form government again: PM Modi
'బిహార్​లో గెలుపెవరిదో మొదటి దశ పోలింగ్​తోనే తేలిపోయింది'

బిహార్​లో సీఎం నితీశ్​ కుమార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొదటి విడత పోలింగ్​ను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. కరోనా సమయంలోనూ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయ పండితుల అంచనాలు తప్పని రుజువు చేశారని మోదీ అన్నారు.

రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛప్రాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్ ​నేత రాహుల్​ గాంధీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు.

ఛప్రా ర్యాలీలో మాట్లాడుతున్న మోదీ

"ఎన్డీఏది రెండు ఇంజిన్లు ఉండే శక్తిమంతమైన ప్రభుత్వం. మరోవైపు ఇద్దరు యువరాజులున్నారు. వారిలో ఒకరు ఆటవిక రాజ్యం నుంచి వచ్చిన వారు. ఎన్డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆ ఇద్దరు యువరాజులేమో సింహాసనాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోనూ మూడేళ్ల క్రితం ఇద్దరు యువరాజులు నల్లజాకెట్లు ధరించి బస్సులపై కూర్చొని చేతులు ఊపుతూ గ్రామాల్లో తిరగడం మీరు చూసే ఉంటారు."

-ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రజలు ఎన్​డీఏకే మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు మోదీ. అందుకే ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని ఎద్దేవా చేశారు.

Last Updated : Nov 1, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.