బంగారం అంటే ఇష్టం ఉండని వారెవరూ? తమ అంతస్తును ప్రదర్శించేందుకు బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. ఇప్పటివరకు కొంతమంది బంగారు చొక్కాలు, కత్తెర వాడటమూ చూశాం. ఇంకొంత మంది కార్లకు బంగారు పూత పూయించినవారు ఉన్నారు.
కానీ, ఈ కరోనా కాలంలో అవసరంతోపాటు ట్రెండింగ్ వస్తువు మాస్క్. అదీ కూడా బంగారంతో చేయించుకున్నాడు ఓ వ్యక్తి. అవునండీ నిజమే.. మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్కు చెందిన శంకర్ కుర్హడే.. 55 గ్రాముల స్వచ్ఛమైన పసిడితో చేసిన మాస్కును ధరిస్తున్నాడు. దీని ధర రూ.2.90 లక్షలు.
ఈ మాస్కును 8 రోజుల్లో తయారు చేశాడు స్వర్ణకారుడు. గాలి పీల్చుకునేందుకు వీలుగా చాలా సన్నగా దీన్ని తయారు చేశాడు. కొల్హాపురీ క్షౌర శాల యజమాని బంగారు కత్తెరలు ఉపయోగించటం చూసి స్ఫూర్తి పొందానని చెబుతున్నాడు శంకర్.