ETV Bharat / bharat

సోషల్​ మీడియా సత్తా... 'కాన్​జీ బడే'కు అందరూ ఫిదా!

బాబా కా దాబా... సామాజిక మాధ్యమాల్లో ఇటీవల బాగా వినిపించిన ఓ హోటల్ పేరు. ఒక్క వీడియోతో.. ఆ హోటల్​ నడిపే వృద్ధ దంపతుల గురించి దేశమంతా తెలిసింది. కరోనాతో బతుకుదెరువును కోల్పోయిన వాళ్లను.. ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకొచ్చారు. ఇప్పుడు ఆగ్రాలో మరో వృద్ధుడికి సాయం చేసేందుకు తరలివస్తున్నారు నెటిజన్లు. అతడి హోటల్​ ఎదుట క్యూ కడుతున్నారు.

After Delhi's 'Baba Ka Dhaba', people queue up at Agra's 'Kanji Bada' following viral video
సామాజిక మాధ్యమాల సత్తా... 'కాన్​జీ బడా'కు అందరూ ఫిదా!
author img

By

Published : Oct 11, 2020, 11:18 AM IST

Updated : Oct 11, 2020, 11:58 AM IST

దిల్లీలో 'బాబా కా దాబా'ను నడిపే వృద్ధ దంపతులను ఆదుకున్నట్లే ఆగ్రాలో నారాయణ్​ సింగ్​ అనే వృద్ధుడిని నెటిజన్లు ఆదరిస్తున్నారు. 'కాన్‌జీ బడే' హోటల్​కు ఇప్పుడు ఎంతోమంది విచ్చేస్తున్నారు. అతడితో ఫోటోలు దిగి మురిసిపోతున్నారు.

అసలెవరీ నారాయణ్​ సింగ్​..?

ఆగ్రాలో కమాలా నగర్​ ప్రాంతంలో 'కాన్‌జీ బడే' పేరుతో ఓ హోటల్​ను నడపుతున్నారు 90 ఏళ్ల నారాయణ్‌ సింగ్‌. 40 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కరోనాతో విధించిన లాక్​డౌన్​ అతడి ఉపాధిని దెబ్బతీసింది. అంతో ఇంతో వచ్చే సంపాదన కూడా రాకుండా పోయింది.

" లాక్​డౌన్​ వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాను. నా బతుకుదెరువును కోల్పోయాను. హోటల్​ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది."

-- నారాయణ్​ సింగ్, కాన్‌జీ బడే హోటల్​ యజమాని

ఆ వీడియోతో..

నారాయణ్​ సింగ్​ దీనస్థితిని తెలుపుతూ ధనిష్ట అనే అమ్మాయి ఓ వీడియోను తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. ఆ వీడియో వైరల్​గా మారగా.. ఎంతో మంది అతడి హోటల్​కు విచ్చేస్తున్నారు. 'కాన్‌జీ బడే'ను సందర్శించిన వారిలో ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ కూడా ఉన్నారు.

"దిల్లీలో 'బాబా కా దాబా' గురించి తెలుసుకుని ఆ ప్రేరణతో నేను ఈ వీడియో తీశాను. అందరికీ చేరేలా ప్రయత్నించాను. ఈ వీడియో వల్ల స్థానికంగా ఆ వృద్ధుడికి సాయం అందుతుందని నేను అనుకున్నాను. ఇలాగే మరింత మందికి నేను సాయపడాలనుకుంటున్నాను. "

-- ధనిష్ట, (కాన్​జీ బడే వీడియో తీసిన యువతి)​

అసిస్టెంట్​ కోసం..

దిల్లీ మాలవియా నగర్​లోని 'బాబా కా దాబా' యజమాని కాంతా ప్రసాద్​... ఇప్పుడక్కడ ఓ సెలెబ్రెటీలా మారిపోయాడు. ఎంతో మంది అతనితో ఫోటోలు దిగేందుకు బారులు తీరుతున్నారు. అనేక కంపెనీలు తమ ఉత్పత్తులు ప్రచారం కోసం ఆ హోటల్​ దగ్గరకు విచ్చేస్తున్నాయి. ఇప్పుడు తనకు వచ్చిన గిరాకీని సర్దుబాటు చేసుకునేందుకు, తన హోటల్లో పనిచేసేందుకు ఓ సహాయకుడినీ నియమించుకోవాలని చూస్తున్నాడు కాంతా ప్రసాద్.

ఈ రెండు ఉదంతాలు.. సామాజిక మాధ్యమాల ద్వారా అందే సేవను చాటుతున్నాయి.

ఇదీ చూడండి:ఫోన్​ కోసం 60 అడుగుల బావిలో నీటిని తోడేశాడు!

Last Updated : Oct 11, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.