ETV Bharat / bharat

'కాంగ్రెస్​ వస్తే రఫేల్​ సంగతి తేలుతుంది'

అమేఠీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ కుంభకోణం​ సంగతి తేలుస్తామన్నారు. ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదని ఆరోపించారు.

'కాంగ్రెస్​ వస్తే రఫేల్​ సంగతి తేలుతుంది'
author img

By

Published : Apr 22, 2019, 4:42 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. సొంత నియోజకవర్గం అమేఠీలోని తిలోయిలో.. బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్. మోదీ ఐదేళ్ల పాటు బడా వ్యాపారులకే చౌకీదార్​గా వ్యవహరించారని ఆరోపించారు. పేదల ఇళ్ల బయట చౌకీదార్​ని ఎప్పుడైనా చుశారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రఫేల్​ వ్యవహారం అంతు తేలుస్తామని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు.

కాంగ్రెస్​ వస్తే రఫేల్​ సంగతి తేలుతుంది: రాహుల్​ గాంధీ

"ఐదేళ్లలో చౌకీదార్​... అనిల్​ అంబానీ, మెహుల్​ చోక్సీ, నీరవ్​ మోదీ లాంటి దొంగలకు కాపలాదారుగా వ్యవహరించారు. మీ డబ్బు దొంగిలించి, మీ జేబులోంచి డబ్బులు లాక్కుని అనిల్​ అంబానీ లాంటి వారి జేబులో పెట్టారు. నరేంద్ర మోదీ భారత ప్రజల నుంచి మాత్రమే దొంగిలించలేదు. సోదర సోదరీమణులారా... అధికమొత్తంగా మీ దగ్గర నుంచి దొంగిలించారు. ఈ చౌకీదార్ దేశమంతా తిరిగి చెప్తున్నారు.. సర్కారు వద్ద డబ్బులు లేవని. ఎందుకంటే చౌకీదార్ చోర్ హై. రఫేల్​ కుంభకోణం బయటపడుతుంది. అంబానీ, మోదీ పట్టుబడతారు. ఇప్పుడు ఈ చౌకీదార్ అంటారు... మేమంతా చౌకీదార్​లమేనని. దేశమంతా చౌకీదార్​లేనని. 30 వేల కోట్లు అనిల్​ అంబానీకి ఎందుకు ఇచ్చారో అడగండి. ఇందుకు ప్రతిగా మోదీకి ఆయన ఏం చేశారో కూడా అడగండి. మా ప్రభుత్వం రాగానే రఫేల్​పై విచారణ జరుగుతుంది మోదీజీ. ఇది మరవొద్దండీ. అప్పుడు నిజం బయటకు వస్తుంది." - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

Bijapur (Chhattisgarh) Apr 21 (ANI): Fifteen Naxals, including 9 men and 6 women surrendered in Chhattisgarh's Bijapur district on Sunday. Surrendered Naxals included top commanders. Bijapur is one among the most Naxal hit districts of Chhattisgarh.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.