ETV Bharat / bharat

'అయోధ్య పూర్తయింది- ఇక కాశీ, మథుర కోసం ఉద్యమం' - ayodhya movement

అయోధ్యలో చారిత్రక రామ మందిర నిర్మాణం బుధవారం ప్రారంభంకానున్న తరుణంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాజపా సీనియర్​నేత, భజరంగ్​దళ్​ వ్యవస్థాపక అధ్యక్షుడు వినయ్​ కటియార్. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. 1990లలో జరిగిన రామజన్మభూమి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారులపై కాల్పులు జరపాలని అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్​ ఇచ్చిన ఆదేశాలు సహా పలు కీలక విషయాల గురించి వివరించారు.

After Ayodhya, there will be big movement for Kashi and Mathura
ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖి
author img

By

Published : Aug 3, 2020, 5:15 PM IST

అయోధ్యలో రామ మందిరానికి భూమిపూజతో భక్తుల కల నెరవేరే సమయం ఆసన్నమైందని పరవశించిపోతున్నారు భాజపా సీనియర్ నేత, భజరంగ్​దళ్​ వ్యవస్థాపక అధ్యక్షుడు వినయ్​ కటియార్. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. 1990లలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన అయోధ్య ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి భీకర పరిస్థితుల గురించి వివరించారు.

ఆనాడు అయోధ్య ఉద్యమం ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత లాఠీ దెబ్బలు, తూటాలకు ఎదురునిలబడి కరసేవకులు పోరాటం కొనసాగించారని చెప్పారు కటియార్​. ఘర్షణలతో వీధులు నెత్తురుమయమైనప్పటికీ వెనుకంజ వేయలేదన్నారు.

"రామ భక్తులపై కాల్పులు జరపాలని అప్పటి ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్​ యాదవ్​ ఇచ్చిన ఆదేశాలతో సరయూ నది రక్తంతో ఎరుపెక్కింది. చరిత్రలో ఆయన ఒక హంతకుడిగా గుర్తుండిపోతారు. ముస్లింలకు 40 ఎకరాల భూమి ఇవ్వాలని అప్పట్లో అటల్​ బిహారీ వాజ్​పేయీ మొదట ప్రతిపాదించారు. కానీ ముస్లింలు దానిని తిరస్కరించారు. కానీ ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో సంతోషిస్తున్నాం. అయోధ్య ఉద్యమ విజయంలో దివంగత అశోక్​ సింఘాల్​దే కీలక పాత్ర. మహంత్​ అవైద్యనాథ్, పరమహన్స్ రామచంద్ర దాస్, దావూద్​ దయాల్ ఖన్నా ముఖ్య భూమిక పోషించారు."

-వినయ్ కటియార్​.

కాశీ, మథుర కోసం మరో ఉద్యమం

అయోధ్య ఉద్యమం కోసమే భజరంగ్​దళ్​ స్థాపించామని, ఇప్పుడు అది సాధించామన్నారు కటియార్​. ఇక కాశీ విశ్వనాథ్, మథుర ఆలయాల కోసం మరో ఉద్యమం ప్రారంభించనున్నట్లు చెప్పారు.

'అయోధ్యలో రామాలయాన్ని పునాది నుంచి పునర్​నిర్మిస్తున్నాం. కానీ కాశీ విశ్వనాథ్, మథుర ఆలయాలు భిన్నం. ఈ రెండు మందిరాల చుట్టూ మసీదులున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించాలి' అని కటియార్​ అన్నారు.

రాజకీయ జీవితంలో భాజపా ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు కటియార్​. పార్టీ కోరితే 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఇదీ చూడండి: అయోధ్యలో యోగి- భూమిపూజ ఏర్పాట్ల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.