ETV Bharat / bharat

భారత్ సత్తా చాటిన ఏరో ఇండియా ప్రదర్శన - Ramnath kovind

బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో జరిగిన ఏరో ఇండియా వైమానిక విన్యాసాలు ముగిశాయి. దీనిలో ప్రపంచవ్యాప్తంగా 601 సంస్థల తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. రఫేల్‌ జెట్, సుఖోయ్‌ సహా పలు యుద్ధ విమానాలుఈ ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి. ఏరో ఇండియా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌.. 13వ ఏరోఇండియా కార్యక్రమం భారత రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను చాటి చెప్పిందన్నారు.

Aero India-2021 closing exercises
భారత్ సత్తా చాటిన ఏరో ఇండోయా ప్రదర్శన
author img

By

Published : Feb 5, 2021, 11:29 PM IST

బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో మూడు రోజులపాటు సాగిన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. ఈసారి ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 601 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. రఫేల్‌ జెట్, సుఖోయ్‌, అడ్వాన్డ్స్‌ లైట్‌ హెలికాఫ్టర్‌ ధ్రువ్‌ , అమెరికా అపాచి హెలికాప్టర్లు, బీ-1బీ లాన్సర్‌ సూపర్‌సోనిక్‌ బాంబర్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్య కిరణ్‌ విమానాలు, సారంగ్‌ హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కరోనా దృష్ట్యా ఈసారి హైబ్రిడ్‌ ఎయిర్‌షోగా దీన్ని నిర్వహించారు. సాధారణ ప్రేక్షకులు డిజిటల్‌ వేదికల ద్వారా ఈ ప్రదర్శనను వీక్షించారు.

సవాళ్లును ఎదుర్కొంటూ..

కరోనా కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్నా.. ఏరో ఇండియా వంటి పెద్ద కార్యక్రమాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఏరో ఇండియా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 13వ ఏరో ఇండియా కార్యక్రమం భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే కాక భారత్‌ ఉత్పత్తి సామర్థ్యాలను చాటి చెప్పిందని కొనియాడారు. రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఎంతో అభివృద్ధిని సాధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఆర్థికంగా బలపడటంతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటున్నామని రాష్ట్రపతి తెలిపారు.

"గత ఏడాది కరోనా కారణంగా ఇంతవరకూ ఎప్పుడూ చూడని కష్టాలు అనుభవించాం. కొవిడ్‌ ప్రతికూల ప్రభావం ప్రపంచంలోని అన్ని రంగాలపై పడింది. మహమ్మారి విసిరిన సవాళ్లు కొనసాగుతున్నా.. ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో 43 దేశాల ప్రతినిధులు, 530 కంపెనీల ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వివిధ దేశాలు, సంస్థల మధ్య ఒప్పందాలు, సహకారాల రూపంలో 201 కొత్త వ్యాపార భాగస్వామ్యాలకు అవగాహన ఒప్పందం జరిగింది."

- రామ్‌నాథ్‌కోవింద్‌, రాష్ట్రపతి

ఏరో ఇండియా 2021 కార్యక్రమంలోనే దేశీయ రక్షణ కొనుగోళ్లలో అతిపెద్ద ఒప్పందం కుదిరింది. రక్షణశాఖ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ హాల్స్ కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 83 తేజస్ విమానాల కొనుగోలు కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా హాల్‌కు అప్పగించింది. కరోనా మహమ్మారి వేళ ఏరో షోలో అనేక దేశాలకు చెందిన సంస్థలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఏరో ఇండియా 2021, స్టార్టప్‌ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. అంకురాలు తమ వస్తు సేవల సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశమని చెప్పారు.

"2015-2020 మధ్య రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2 వేల కోట్ల రూపాయల నుంచి 9 వేల కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ విషయం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ రంగ ఏవియేషన్‌ మార్కెట్‌లో భారత్‌ ఒకటి. ఏరోస్పేస్‌కు సంబంధించిన ఉత్పత్తులను పెద్ద సంఖ్యలో ఎంఎస్‌ఎంఈలు సరఫరా చేస్తున్నాయి. 2025 నాటికి దేశీయ రక్షణ ఉత్పత్తులను 25 బిలియన్‌ డాలర్లకు, ఎగుమతుల్ని 5 బిలియన్‌డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థకు వైమానికరంగం ముఖ్యప్రాత వహించడంతో పాటు, ఉద్యోగాల కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది."

- రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణశాఖ మంత్రి

ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడీఆర్​ఎక్స్​) చొరవతో రక్షణ రంగంలో అంకురాల ఆవిష్కరణలకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. మిత్ర దేశాలకు రక్షణ సామగ్రిని ఎగుమతి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని రక్షణమంత్రి చెప్పారు. తేలికపాటి యుద్ధ విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్లు, ట్యాంకులు, ఫిరంగులతో సహా ఇతర ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు ఆయన ప్రకటించారు.

భాగస్వామ్య విస్తరణ

ఈ విన్యాసాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​ (హాల్​), రోల్స్​ రాయిస్​లు తమ భాగస్వామ్యాన్ని విస్తరించాయి. పౌర, రక్షణ వైమానిక పరికరాల సరఫరా, నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించాయి.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంటర్నెట్​ పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.