భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కే. అడ్వాణీ విషజ్వరంతో బాధపడుతున్నారు. 5 రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన... గురువారం తన నివాసంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం లేదు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ తన నివాసంలో దశాబ్దాలుగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ వస్తున్నారు. 91 ఏళ్ల అడ్వాణీ వైరల్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా ఈ సారి జాతీయ జెండా ఎగరవేయడం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.