ETV Bharat / bharat

అడ్వాణీ, జోషిలకు అందని 'భూమిపూజ' ఆహ్వానం! - Murli Manohar Joshi news

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు. చారిత్రక కార్యక్రమంలో హాజరయ్యేందుకు ఇప్పటికే ఆహ్వానాలు పంపుతున్నారు. అయితే.. ఆలయ నిర్మాణానికి ఏళ్ల తరబడి ముందుండి నడిచిన భాజపా కురువృద్ధులు లాల్​ క్రిష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలకు ఇంకా ఆహ్వానం అందలేదని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

Advani, Joshi
అడ్వాణీ, జోషిలకు అందని 'భూమిపూజ' ఆహ్వానం!
author img

By

Published : Jul 31, 2020, 5:09 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న భారతీయుల కల నేరవేరుస్తూ.. ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. అయితే.. అయోధ్యలో రామాలయం కోసం ముందుండి పోరాడిన భాజపా నేతలు లాల్​ క్రిష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలకు ఇంకా ఆహ్వానం అందకపోవటం గమనార్హం. ఆహ్వానం అందకపోతే చారిత్రక కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరుకారని వారి సన్నిహత వర్గాల తెలిపాయి.

" చారిత్రక కార్యక్రమానికి మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఆహ్వానం లేకుండా ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదు."

- అడ్వాణీ సన్నిహిత వర్గాలు

ఇలాంటి సమాధానమే ఇచ్చాయి మనోహర్​ జోషి సన్నిహిత వర్గాలు.

మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అడ్వాణీ, జోషిలతోపాటు 200 మందికి ఆహ్వానం పంపినట్లు పేర్కొంది అయోధ్యకు చెందిన ఓ సంస్థ.

రథయాత్రతో..

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 1990, సెప్టెంబర్​లో సోమనాథ్​ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టి.. ప్రజల్లో ఆలయ నిర్మాణ సెంటిమెంట్​ను రగల్చటంలో విజయం సాధించారు అడ్వాణీ. అలాగే బాబ్రీ మసీదు కేసులో ఇరువురు నేతలు నిందితులుగా ఉన్నారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.