చర్మం రంగుకు సంబంధించి ఎలాంటి వివక్షను చూపేలా వాణిజ్య ప్రకటనలు ఉండకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే పేర్కొన్నారు. తెలుపు వర్ణాన్ని, చర్మం రంగును ప్రోత్సహించే వాణిజ్య ప్రకటనలను నిషేధించడాన్ని కేంద్రం పరిగణిస్తోందా అని రాజ్యసభలో ఎదురైన ప్రశ్నకు చౌబే లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
అడ్వర్టైజింగ్ పరిశ్రమకు చెందిన స్వీయ నియంత్రణ సంస్థ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసిందని, వాణిజ్య ప్రకటనల్లో తప్పుదోవ పట్టించే అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ఆ విభాగం విచారిస్తుందని చౌబే పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనాను జయించిన 106 ఏళ్ల బామ్మ