ETV Bharat / bharat

ఎయిమ్స్​లో ఎంబీబీఎస్​కు 'నీట్' రాయాల్సిందే!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్​, జిప్​మర్ విద్యా సంస్థల్లోనూ నీట్ పరీక్ష ద్వారానే ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్​ను తప్పనిసరి చేయనుంది జాతీయ వైద్య కమిషన్.

ఎయిమ్స్​, జిప్​మర్​లకూ తప్పని 'నీట్'
author img

By

Published : Oct 4, 2019, 9:08 PM IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్( ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), జిప్​మర్( జవహార్​లాల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్​ ప్రవేశాలకు నీట్ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్​మర్ మినహా మిగిలిన విద్యా సంస్థల్లో నీట్ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు చేపడుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిమ్స్, జిప్​మర్​ విద్యాసంస్థలు ప్రస్తుతం సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపడుతున్నాయి. 2020 విద్యా సంవత్సరం నుంచి నీట్ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు చేపట్టేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. జాతీయ వైద్య కమిషన్ ప్రకారం అన్ని కళాశాలలను ఒకే ప్రవేశ పరీక్ష కిందకు చేర్చేలా సిద్ధమవుతోంది.

"జాతీయ వైద్య కమిషన్ చట్టం ప్రకారం ఎయిమ్స్, జిప్​మర్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ ద్వారానే ప్రవేశాలు చేపడతాం. దీని ద్వారా వైద్య విద్యలో దేశంలో ఉమ్మడి ప్రమాణాలు నెలకొల్పే అవకాశం ఉంటుంది. ఒకే పరీక్ష ఉండటం వల్ల విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. వివిధ కౌన్సెలింగ్ ప్రక్రియ​ల్లో పాల్గొనే శ్రమ తగ్గుతుంది. వారి కుటుంబ సభ్యలకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. ఒక్కసారి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్​ పరీక్షలో ఉత్తీర్ణులైతే, ఆ వ్యక్తి లైసెన్స్ పొంది ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ర్యాంకులు మెరుగుపరుచుకునేందుకు ఎన్నిసార్లు అయినా ఈ పరీక్షను రాసుకోవచ్చు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నామినేట్ చేసిన వారి నుంచి మెడికల్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు అక్టోబర్ 14 న డ్రా నిర్వహిస్తాం."
-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

నేషనల్ ఎగ్జిట్ టెస్ట్

జాతీయ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలు సహా లైసెన్స్ పొందటానికి నెక్స్ట్​ (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)పరీక్ష తప్పనిసరి కానుంది. నిబంధనలు రూపొందించి దీనిని అమలు చేయడానికి మూడేళ్ల సమయం పడుతుందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. జాతీయ వైద్య కమిషన్ ఈ పరీక్షను ఖరారు చేస్తుంది. మెడికల్ డిగ్రీకి అభ్యర్థులకు అవసరమయ్యే థియరీ, వైద్య నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇదే స్క్రీనింగ్ టెస్ట్​గా ఉంటుంది.

దేశంలో వైద్య విద్య, వృత్తితో పాటు వాటి సంస్థలపై నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ఉద్ధేశంతో జాతీయ వైద్య మండలి స్థానంలో జాతీయ వైద్య కమిషన్ తీసుకొచ్చింది కేంద్రం. ఆగస్టు 8న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఫలితంగా వైద్య విద్యలో సంస్కరణలు చేపట్టే అవకాశం లభించింది. ఈ చట్టంలో పొందుపర్చిన కొన్ని సెక్షన్లు సెప్టెంబర్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.

ఇదీ చూడండి:ముంచెత్తిన వర్షాలు.. మోకాళ్ల లోతు నీటిలో శవయాత్ర!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.