ETV Bharat / bharat

మోదీ ఖాతా హ్యాక్​- అంగీకరించిన ట్విట్టర్

author img

By

Published : Sep 3, 2020, 10:33 AM IST

Updated : Sep 3, 2020, 3:01 PM IST

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత వెబ్​సైట్​ ఆధారిత ట్విట్టర్​ ఖాతా హ్యాక్​పై ఆ సంస్థ స్పందించింది. హ్యాకింగ్​ నిర్ధరించుకున్నామని, వెంటనే ఆ ట్వీట్లను తొలగించి భద్రత చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఇంకా ఎన్ని ఖాతాలు హ్యాక్​ అయ్యాయో ఇప్పుడే అంచనా వేయలేమని తెలిపింది.

PM Narendra Modi
మోదీ ఖాతా హ్యాక్​

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్​కు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆ సంస్థ అంగీకరించింది. క్రిప్టోకరెన్సీ ద్వారా పీఎం సహాయనిధికి సాయం చేయాలంటూ ఈ ఖాతా నుంచి వరుస ట్వీట్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్..​ ఆ ట్వీట్లను తొలగించినట్లు స్పష్టం చేసింది.

"ఈ హ్యాకింగ్‌ను మేం నిర్ధరించుకున్నాం. వెంటనే భద్రత చర్యలకు ఉపక్రమించాం. హ్యాకర్ చేసిన ట్వీట్లను తొలగించాం. అయితే, అదనంగా ఎవరెవరి ఖాతాలు హ్యాక్​ అయ్యాయో ఇప్పుడే అంచనా వేయలేం. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం."

- ట్విట్టర్ ప్రకటన

మోదీ వెబ్​సైట్ ట్విట్టర్​ ఖాతాకు 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తర్వాత జరిగిన హై ప్రొఫైల్ ట్విట్టర్​ అకౌంట్ హ్యాక్ ఇదే. జులై 15న జరిగిన ఈ హ్యాకింగ్​లో ట్విట్టర్​ ఉద్యోగుల నుంచి మోసపూరితంగా వివరాలను పొందినట్లు సంస్థ గుర్తించింది.

అయితే, మోదీ ఖాతా హ్యాకింగ్​​ గతంలో మాదిరిగా ఉద్యోగుల పొరపాటు వల్ల జరిగినట్లు ఆధారాలు లేవని ట్విట్టర్ వెల్లడించింది.

మోదీ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్​ నేరగాడు.. కొవిడ్ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ ద్వారా పీఎం సహాయ నిధికి విరాళం అందించాలని వరుస ట్వీట్లు చేశాడు. అందులో క్రిప్టో కరెన్సీ ఖాతా నంబరు కూడా జత చేశాడు.

PM Narendra Modi
మోదీ ఖాతా హ్యాక్​

ఇదీ చూడండి: ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలను ఎలా హ్యాక్ చేశారంటే?

Last Updated : Sep 3, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.