ETV Bharat / bharat

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 5 ఏళ్లు? - ayodhya latest news

అయోధ్యపై సుప్రీకోర్టు తీర్పు అనంతరం ఇప్పుడు అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారో అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. రామాలయం కోసం విశ్వ హిందూ పరిషత్ 1990లోనే నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే వారు రూపొందించిన నమూనా ప్రకారం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుంది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 5 ఏళ్లు?
author img

By

Published : Nov 11, 2019, 9:00 AM IST

కోర్టు తీర్పు వెలువడినందున ఇక అందరి దృష్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణంపైనే పడింది. మందిరం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) రూపొందించిన నమూనా ప్రకారమయితే పనులు పూర్తికావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుంది. కనీసం 250 మంది శిల్పులు నిరంతరాయంగా కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.

ఇప్పటికే సగం పనులు పూర్తి

1990 నుంచే ఇక్కడ వీహెచ్‌పీ కార్యశాలను ప్రారంభించి పనులకు శ్రీకారం చుట్టింది. మందిరానికి 212 స్తంభాలు అవసరం కాగా, వాటిలో 106 స్తంభాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మూడు దశాబ్దాలుగా చెక్కిన ఈ స్తంబాలు కింది అంతస్తు వరకు సరిపోతాయి. పై అంతస్తుకు అవసరమైన స్తంభాలు, ఇతర శిల్పాలను చెక్కాల్సి ఉంది. ఈ ఏడాది జులైలో ప్రధాన శిల్పి రజనీకాంత్‌ సోంపురా మరణించడంతో అప్పటి నుంచి పనులు ఆగిపోయాయి. ప్రస్తుతానికయితే కార్యశాలలో శిల్పులు ఎవరూ పనిచేయడం లేదు. పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే 250 మంది శిల్పులు అవసరమవుతారని కార్యశాల సూపర్‌వైజర్‌ అన్నూభాయి సోంపురా అభిప్రాయపడ్డారు. ఆలయం పనులు పూర్తికావడానికి అయిదేళ్లు పడుతుందని అన్నారు. రాజస్థాన్‌ నుంచి శిలలను తీసుకురావాల్సి ఉంటుందని, శిల్పాలను తెల్లసిమెంట్‌తో అతికించాల్సి ఉందని వివరించారు. గర్భగుడికి గోడలు నిర్మించాల్సి ఉందని, పాలరాయితో ‘చౌకత్‌’లను చెక్కాల్సి ఉందని చెప్పారు. అన్నింటిలోనూ ఆలయ శిఖర నిర్మాణం కీలకమైనదని వివరించారు.

సోంపురా ఆకృతికే కట్టుబడ్డ వీహెచ్‌పీ

ప్రముఖ శిల్పి చంద్రకాంత్‌ సోంపురా రూపొందించిన ఆకృతి ఆధారంగానే రామ మందిరం నిర్మించాలని వీహెచ్‌పీ భావిస్తోంది. అప్పటి వీహెచ్‌పీ నాయకుడు అశోక్‌ సింఘాల్‌ సూచన మేరకు సోంపురా 1989లో ఈ ఆకృతిని రూపొందించారు. ఉద్యమం సందర్భంగా ఈ నమూనాయే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల దీని ఆధారంగానే నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నట్టు వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ చెప్పారు. సంస్థ కార్యవర్గ సభ్యుల ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్టు తెలిపారు.

రూపాయి పావలా విరాళాలతోనే పనులు

according-to-the-vishwa-hindu-parishad-vhp-model-it-takes-almost-five-years-to-complete-ram-mandir-in-ayodhya
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 5 ఏళ్లు?

వీహెచ్‌పీ అవధ్‌ ప్రాంత నాయకుడు శరద్‌ శర్మ మాట్లాడుతూ పనులు చేపట్టడంపై రామజన్మభూమి న్యాస్‌ సభ్యులు త్వరలో సమావేశమయి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. 1984లో ఆలయానికి శంకుస్థాపన చేశామని, ప్రజలు ఇచ్చిన రూపాయి పావలా విరాళాలతో రూ.8 కోట్లు సమకూరిందని తెలిపారు. 150 మంది శిల్పులు, వందలాది మంది కార్మికులు రోజుకు ఎనిమిది గంటల పాటు పనిచేశారని చెప్పారు. తొలుత విరాళాలు కూడా బాగా వచ్చాయని, మొదటి పదేళ్ల పాటు పనులు చురుగ్గా సాగాయని అన్నారు. ఆ తరువాత పనులు మందగించాయని, శిల్పులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని వివరించారు. పనులు పునః ప్రారంభించడంపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో శాంతి నెలకొల్పడంపైనే దృష్టి సారించామని చెప్పారు.

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 11 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0135: Spain Citizens AP Clients Only 4239186
Citizens Party suffers huge loss in Spanish election
AP-APTN-0124: Spain PSOE Reax AP Clients Only 4239184
Socialist supporters react to election results
AP-APTN-0123: Spain People's Party AP Clients Only 4239185
Casado pledges to work to end political instability
AP-APTN-0114: Bolivia Crisis 2 AP Clients Only 4239156
Bolivian president calls for new election
AP-APTN-0046: Australia Wildfires Emergency No Access Australia 4239183
New South Wales declares state of emergency
AP-APTN-0043: Bolivia Resignation AP Clients Only 4239182
Morales explains reasons for resignation
AP-APTN-0019: Spain Vox 2 AP Clients Only 4239181
Abascal welcomes election results, supporters' reax
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.