వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌కు రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో నేడు శారీరక, మాససిక పరీక్షలు జరగనున్నాయి. నిన్న రాత్రే దిల్లీ చేరుకున్నారు పైలట్.
వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది పాకిస్థాన్. ప్రజలు అభినందన్‌కు ఘన స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఇది జరిగింది..
పుల్వామా దాడి అనంతరం భారత వాయుసేన(ఐఏఎఫ్) పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత మిలిటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడి చేయటానికి ప్రయత్నించగా ఐఏఎఫ్ ధీటుగా జవాబిచ్చింది.
ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 27న జరిగిన ఘర్షణలో మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ అభినందన్ పాక్ సేనలకు బందిగా దొరికారు. భారత్ చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించటంతో పాకిస్థాన్ మూడు రోజల అనంతరం అభినందన్‌ను తిరిగి అప్పగించింది.