ETV Bharat / bharat

జమ్ము పోలీసులను పరుగులు పెట్టించిన 'డ్రోన్​' - జమ్ముకశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో నేలపై పడి ఉన్న ఓ డ్రోన్​ అక్కడి పోలీసులను పరుగులు పెట్టించింది. ఆ డ్రోన్​ పాకిస్థాన్​ నుంచి వచ్చి ఉంటుందని భావించారు పోలీసులు. చివరకు అది భారత సైన్యానికి చెందినది తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Abandoned drone sends police into tizzy in Jammu
జమ్మూ పోలీసులను పరుగులు పెట్టించిన 'డ్రోన్​'
author img

By

Published : Jul 13, 2020, 5:59 PM IST

జమ్ముకశ్మీర్​లోని ఓ గ్రామంలో నేలపై పడి ఉన్న ఓ డ్రోన్​ కలకలం సృష్టించింది. తొలుత ఆ డ్రోన్​.. పాకిస్థాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు ద్వారా జమ్ములోకి ప్రవేశించిందని పోలీసులు భావించారు. కానీ అది భారత సైన్యానికి చెందిందని.. బ్యాటరీ అయిపోవడం వల్ల నేలపై పడిపోయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ జరిగింది...

ఫల్లియన్​ మండలంలోని భూతియా చక్​ వద్ద ఓ డ్రోన్​ను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రోన్ల సహాయంతో ఆయుధాలు, డ్రగ్స్​ను అక్రమంగా రవాణా చేయడానికి పాకిస్థాన్​ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలానికి పరుగులు పెట్టారు. డ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తు అనంతరం ఆ డ్రోన్​ భారత సైన్యానికి చెందినదని నిర్ధరించుకున్నారు జమ్ము పోలీసులు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా డ్రోన్​ను పరీక్షిస్తున్న సమయంలో దాని బ్యాటరీ అయిపోయిందని.. ఫలితంగా ఆ గ్రామంలో పడిందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- జమ్ములో ఆర్మీ చీఫ్​ పర్యటన- భద్రతపై సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.