కరోనా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేయడానికి తెచ్చిన ఆరోగ్యసేతు యాప్‌ను ఇప్పటి వరకు 9 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. కరోనా పోరులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆరోగ్యసేతు యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
కరోనా నియంత్రణపై ఆరుగురు సభ్యులతో కూడిన బృందంతో నీతి అయోగ్ సీఈఓ సమీక్షిస్తున్నారు. 92 వేల ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. హాట్స్పాట్లు గుర్తించి వాటిలో వాలంటీర్లను నియమించి.... అవసరమైన వారికి సహాయం చేయాలని రాష్ట్రాలకు, స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జీవోలకు అమితాబ్ కాంత్ విజ్ఞప్తి చేశారు.