దేశ రాజధాని నగరంలో రోజురోజుకీ కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఆప్ ప్రభుత్వం వైరస్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. నగరంలోని అన్ని హోల్‌సేల్ మద్యం దుకాణాల యజమానులు తమ సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశించింది. అలాగే, ఆయా దుకాణాల వద్ద శానిటైజర్ డిస్పెన్సర్లతో పాటు కరోనా నియంత్రణ ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని బాండ్ ఇన్‌స్పెక్టర్లను ఎక్సైజ్‌శాఖ ఆదేశించింది. దీనిపై ఓ నివేదిక ఇవ్వాలని కోరింది.
ఆయా దుకాణాల వద్ద పాటించాల్సిన చర్యలపై ఇటీవల ఎక్సైజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ జారీ చేసింది. దుకాణం ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద టచ్ ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్లు ఉంచాలని ఆదేఅఇంచింది. అలాగే, కరోనాపై అవగాహన కల్పించే బ్యానర్లు ఆయా భవనాల వద్ద ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించింది. సరకు లోడింగ్, అన్‌లోడింగ్ సమయాల్లో భౌతికదూరం పాటించడం సహా మాస్క్‌లను ధరించాలని సూచించింది.
ఇదీ చూడండి: కరోనాతో తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి మృతి