దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది. నూతన ఎమ్మెల్యేల సమావేశంలో ఆప్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు.
దిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కేజ్రీవాల్. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రమాణ స్వీకారోత్సవంపై చర్చించారు.
ఈ నెల 16న ప్రమాణం..
దిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు కేజ్రీవాల్. ఈనెల 16న ముహూర్తం ఖరారు చేశారు. రాంలీలా మైదానంలో 16న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందని.. ఆయనతోపాటే మంత్రులు ప్రమాణం చేస్తారని ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు.
ఇదీ చూడండి: కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు