ETV Bharat / bharat

'ఎన్​ఆర్​ఐలకు సత్వర ఆధార్​ కార్డులు'

ఎన్​ఆర్​లకూ ఆధార్​ కార్డులు పంపిణీ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ ప్రక్రియ వేగంగా జరగాలని నిర్మలా సీతారామన్​ సూచించారు.

author img

By

Published : Jul 5, 2019, 1:28 PM IST

'ఎన్​ఆర్​ఐలకు సత్వర ఆధార్​ కార్డులు'
'ఎన్​ఆర్​ఐలకు సత్వర ఆధార్​ కార్డులు'

పాస్​పోర్టుల ఆధారంగా ఎన్​ఆర్​ఐలకు ఆధార్​ కార్డులు అందివ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. స్వదేశానికి వచ్చి 180 రోజుల పాటు ఆగకుండా... వారికి సత్వరమే ఆధార్​ పంపిణీ చేయాలన్నారు నిర్మల.

ఆఫ్రికాలోని వివిధ దేశాలతో సంబంధాలు పెంచుకోవడం కోసం 2018లో దౌత్య ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించినట్టు ఉద్ఘాటించారు కేంద్ర మంత్రి. ఇందులో భాగంగా 5 దౌత్య కార్యాలయాలను ప్రారంభించినట్టు తెలిపారు. మరో 4 కార్యాలయాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

శిల్పులు, సృజనాత్మక నైపుణ్యం ఉన్న వారికి సహాయం చేయడానికి ఓ మిషన్​ను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల ప్రకటించారు. వారికి ప్రపంచస్థాయి మార్కెట్​లో అవకాశాలు మెరుగుపరచడానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ఇది పేటెంట్​ హక్కులు పొందడానికి ఉపయోగపడుతుందన్నారు ఆర్థికమంత్రి.

ఇదీ చూడండి- బడ్జెట్​ 2019 : '2024కల్లా ఇంటింటికి తాగునీటి కుళాయి'

Intro:Body:

u

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.