'నాన్నా.. విషం తాగేశాను, నాన్నా.. నేను చచ్చిపోతున్నాను బై. నేనేం తప్పు చేయలేదు.. నాకు బతకాలనుంది నాన్నా. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో నాన్నా గుడ్‌బై...' ప్రాణం విడిచే కొద్ది క్షణాల ముందు మధు మాట్లాడిన చివరి మాటలివి.
కర్ణాటక చిక్కబళ్లాపూర్ చింతామణి తాలూకా వైజ్కురు గ్రామానికి చెందిన 23 ఏళ్ల మధు విషం తాగి వీడియో రికార్డు చేసి మరీ కన్నుమూశాడు. జీవితంలో నిండిపోయిన అసంతృప్తి వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
పాలీడల్ అనే పురుగుల మందు తాగేసి తన తండ్రితో చివరిసారిగా చెప్పాలనుకున్నవన్నీ వీడియోలో చెప్పాడు. మృత్యువు చేరువవుతున్న కొద్దీ మధుకు బతకాలనే ఆశ కలిగింది. అయితే, విషయం తెలుసుకుని ఆసుపత్రిలో చేర్చేసరికి ఆలస్యమయ్యింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
ఇదీ చదవండి:దిల్లీలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి