మరమ్మతుకు గురైన సెల్‌ఫోన్‌ను మార్చుకునేందుకు మొబైల్ ఫోన్ కంపెనీ ప్రతినిధులు నిరాకరించారని... ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనమిది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం దిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రహ్లాదాపూర్‌కు చెందిన భీం సింగ్(40).. ఆన్‌లైన్ తరగతుల కోసం తన మేన కోడలికి 16వేలు వెచ్చించి సెల్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. అది పనిచేయలేదని శుక్రవారం రోహిణిలోని సెల్‌ఫోన్ సేవా కేంద్రానికి వెళ్లాడు.
హ్యాండ్‌సెట్‌ను మార్చడానికి సిబ్బంది నిరాకరించడంతో ఆందోళనకు గురైన భీంసింగ్ తనను తాను నిప్పంటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబరు 6న కూడా భీంసింగ్ సేవా కేంద్రానికి వెళ్లాడని... కానీ కంపెనీ ప్రతినిధులు తమ విధివిధానాలను పేర్కొంటూ అతడి అభ్యర్థనను తిరిస్కరించినట్లు సమాచారం. హ్యాండ్‌సెట్ మార్చుకునేందుకు పలుమార్లు మొబైల్ కంపెనీ ప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడం వల్ల చివరకు నిప్పంటించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్ సైన్యం