ETV Bharat / bharat

ఎల్లమ్మ దేవి కరుణించింది.. ఆమె చచ్చి బతికింది! - DIED WOMAN OPEN EYES

కర్ణాటకలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిందనుకున్న ఓ మహిళ.. అకస్మాత్తుగా లేచి కూర్చుంది. ఇంకేముంది నోళ్లెళ్లబెట్టుకోవడం అక్కడి వారి వంతైంది. ఇంతకీ అక్కడ జరిగిందేంటి?

A women opens eyes when she was brought for funeral that she was dead in Belagavi.
యల్లమ్మ దేవి కరుణించింది.. ఆమె చచ్చి బతికింది!
author img

By

Published : Jan 10, 2020, 11:16 AM IST

Updated : Jan 10, 2020, 1:05 PM IST

ఎల్లమ్మ దేవి కరుణించింది.. ఆమె చచ్చి బతికింది!

అందరూ ఆ మహిళ చనిపోయిందనుకున్నారు. కుటుంబం, బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆమె కళ్లు తెరించింది. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన మాలు యల్లప్ప చౌగులే(55) అనే మహిళ కొన్ని నెలలుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి విషమించడం వల్ల ఈ నెల 7న ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వెంటిలేటర్లపై చికిత్స అందించిన వైద్యులు.. చేతులెత్తేశారు. ఆమె బతకడం కష్టమని, ఇంటికి తీసుకెళ్లిపొమన్నారు.

చౌగులేను అంబులెన్సులో గ్రామానికి తీసుకెళ్తున్న సమయంలో.. ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బంధువులకు కబురుపెట్టారు. అంత్యక్రియల వేళ ఆ మహిళ అనుకోకుండా కళ్లు తెరిచింది. చుట్టూ ఉన్న జనమంతా కళ్లు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎల్లమ్మ దేవి మహిమ వల్లే ఆమె బతికిందని వారు విశ్వసిస్తున్నారు.

ఇదీ చూడండి:దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సుప్రీం

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/priyanka-gandhi-to-meet-bhu-students-civil-society-members-in-varanasi-today20200110090124/

Conclusion:
Last Updated : Jan 10, 2020, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.