మహారాష్ట్ర పుణెకు చెందిన ఓ ప్రకృతి ప్రేమికురాలు... తన ఇంటి ప్రాంగణంలోని కొబ్బరిచెట్టుకు సీమంతం నిర్వహించారు. ఆ చెట్టు ఆరోగ్యంగా పెరిగి, కాయాలని ఆకాంక్షిస్తూ ఇలా చేశారు.
పుణెలోని కార్వెనగర్లో నివసిస్తున్న నీతా యాదవ్ తన బంగ్లా చుట్టూ అనేక చెట్లు పెంచుతున్నారు. కొన్నేళ్ల ముందు కొంకణ్ విశ్వవిద్యాలయం నుంచి కొబ్బరి మొక్కలు తీసుకొచ్చి నాటారు. కానీ వాటిలో ఓ చెట్టుకు సూర్యరశ్మి సరిగా అందలేదు. ఫలితంగా ఆ చెట్టు కాతకు రాలేదు. కొబ్బరి చెట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్ని రకాల ఎరువులు ఉపయోగించినా లాభం లేకుండా పోయింది. అందుకే నీతా తన స్నేహితురాళ్లతో కలిసి ఆ చెట్టుకు చీర కట్టి, అందంగా అలంకరించారు. ఘనంగా సీమంతం నిర్వహించారు.
ఇదీ చూడండి:- 'విగ్రహం కళ్లు తెరిచింది..! ఆలయం కిక్కిరిసింది'