రాత్రి కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్న మంత్రి తనయుడి కారును ఆపిన ఓ మహిళా కానిస్టేబుల్ రాజీనామా చేసిన దుస్థితి గుజరాత్లో నెలకొంది.
ఏం జరిగిందంటే.?
గుజరాత్ ఆరోగ్య మంత్రి కుమార్ కనానీ కుమారుడు ప్రకాశ్.. అర్ధరాత్రి స్నేహితులతో కలిసి సూరత్‌లో కారులో బయల్దేరాడు. మాస్క్ ధరించకుండా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ ఆ కారును ఆపారు. అదే ఆమె చేసిన పాపమయింది. ఆగ్రహించిన మంత్రి కుమారుడు ఆమెతో వాగ్వాదానికి దిగి బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఆమెకు మద్దతు ఇవ్వకపోగా.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
అయినా మద్దతులేరాయే..
గత బుధవారం జరిగిన ఈ ఘటనను పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అధికారులు. మంత్రి కుమారుడు బెదిరించినా.. పోలీసు ఉన్నతాధికారులెవరూ తనకు మద్దతుగా నిలవకపోవడం వల్ల సునీతా యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ప్రకాశ్, ఆమెతో వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: 'జీవితాలను సరిదిద్దుకొనే సమయమిదే'