ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: దేశ ప్రజల ఆలోచనలకు అద్దంపట్టే ఎన్నిక! - DELHI CAA PROTESTS

ఓటర్ల ప్రాధాన్యం దేనికి? స్థానిక అంశాలకా? జాతీయ వ్యవహారాలకా? దిల్లీ శాసనసభ ఎన్నికల వేళ ఈ ప్రశ్న మరోమారు చర్చనీయాంశమైంది. సీఏఏ, ఎన్​ఆర్​సీపై ఆందోళనల నేపథ్యంలో జరుగుతున్న 'దిల్లీ దంగల్​'లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.

a-verdict-on-the-idea-of-india-the-significance-of-delhi-election-2020
దిల్లీ దంగల్​: దేశ ప్రజల ఆలోచనలకు అద్దంపట్టే ఎన్నిక!
author img

By

Published : Feb 6, 2020, 12:16 PM IST

Updated : Feb 29, 2020, 9:36 AM IST

పౌరసత్వంపై రగడ... ఎన్​ఆర్​సీపై ఆందోళన... ఆర్థిక మాంద్యంపై అనుమానం.... ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య చిక్కుకుంది దేశ సామాజిక-రాజకీయ ముఖచిత్రం. ఇలాంటి పరిస్థితుల మధ్య శాసనసభ ఎన్నికలకు సిద్ధమైంది దిల్లీ. ఈనెల 8న పోలింగ్​కు ముహూర్తం. 11న ఫలితం. హస్తిన ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరం. స్థానిక అంశాలకే పరిమితం అవుతుందా? జాతీయ వ్యవహారాలపై ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుందా?

అందుకే ఈ తీర్పు కీలకం...

దిల్లీ... దేశ రాజధాని. అక్కడ అధికారం ఎవరిదన్న అంశం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ ఎన్నిక మరింత ప్రత్యేకం. ఎందుకంటే... దేశ రాజకీయ భవిష్యత్​కు సంబంధించిన 3 కీలక విషయాలపై హస్తిన తీర్పుతో స్పష్టత వచ్చే అవకాశముంది. అవి..

  • ఓటు విషయంలో ప్రజల ఆలోచనా శైలి
  • 'ప్రత్యామ్నాయ రాజకీయాలు' భారత్​లో నెగ్గి నిలబడతాయా?
  • భారత్​లో సమాఖ్య స్ఫూర్తి ఎలా ఉండబోతుంది?

ఎన్నికల విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు దిల్లీ ఓటర్లు. స్థానిక, జాతీయ స్థాయి అంశాల(నేరుగా చెప్పాలంటే... శాసనసభ ఎన్నికలు, లోక్​సభ ఎన్నికల) మధ్య వ్యత్యాసం చూపిస్తుంటారు. ఇది ఆమ్​ఆద్మీ పార్టీకి కలిసివచ్చే విషయమే. ఎందుకంటే ఆ పార్టీ వ్యూహాలన్నీ స్థానిక సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంటాయి.

దిల్లీ ప్రజల ఆలోచనలను మార్చడానికి భాజపా ఈసారి గట్టి ప్రయత్నాలే చేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, కేంద్రంలో తమ(మోదీ సర్కార్​) ప్రదర్శనను ప్రచారాస్త్రంగా మల్చుకుని ప్రజల్లోకి వెళ్లింది. రాష్ట్రం-కేంద్రంలో ఒకే విధమైన ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నది కమలదళం వాదన.

ప్రభుత్వ పనితీరుపైనే ఆధారపడి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రచార క్షేత్రంలో ముందుకుసాగుతున్నా.... భాజపా మాత్రం జాతీయవాదాన్నే జపిస్తోంది. ఆప్​, కాంగ్రెస్​కు దేశ ప్రయోజనాలు పట్టవంటూ పదేపదే ప్రచారం చేస్తోంది.

అభివృద్ధి మంత్రమే కీలకం...

అభివృద్ధి... రాజకీయాల్లో ఎంతో శక్తిమంతమైన హామీ. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకోగల వాగ్దానం. ఇందుకు 'గరీబీ హఠావో', సబ్​ కా సాత్​- సబ్​ కా వికాస్​' వంటి నినాదాలే మంచి ఉదాహరణలు.

ఆప్​ మాత్రం విచిత్ర పరిస్థితుల్లో ఆవిర్భవించింది. ధనం, కండబలం, వారసత్వం-గుర్తింపు ఉంటేనే రాజకీయాల్లో ఉండగలం అనే వాదనను చెరిపివేసింది.

2013లో భారీస్థాయిలో విజయాన్ని అందుకున్న ఆప్​.. రాజకీయ దిశను మార్చేసింది. అప్పటివరకు డబ్బు ఆధారంగా సాగే రాజకీయాలు.. సేవా పథంవైపు మళ్లాయి. అభివృద్ధి పథకాలతో సమాజంలోని వేర్వేరు వర్గాలకు చేరువైంది ఆప్.

వేర్వేరు వర్గాలు అంటే... దిగువ, మధ్యతరగతి, సంపన్న శ్రేణి ప్రజలు. ఈ 3 వర్గాల గురించి సామాజికవేత్తలు అమిత్​ అహుజ, ప్రాదిప్​ చిబ్బెర్​ ఓ విశ్లేషణ చేశారు. దాని ప్రకారం... ఆర్థికంగా వెనకపడిన వర్గాలు ఓటును తమ హక్కుగా భావిస్తారు. రాష్ట్ర వనరులను పొందేందుకు ఎన్నికలను అస్త్రంగా చేసుకుంటున్నాయి మధ్యతరగతి వర్గాలు. ధనికులు మాత్రం పౌర విధులను దృష్టిలో పెట్టుకునే ఓటు వేస్తున్నారు. ఇలా 3 విభిన్నమైన వర్గాల మద్దతు సంపాదిస్తూ ఇక్కడి వరకు వచ్చింది ఆప్. కానీ ఇలా ఎంతకాలం జరుగుతుందనేది కీలక అంశం.

భాజపా పయత్నాలు ఫలించేనా..!

జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చితుల నడుమ ఈసారి దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. జేఎన్​యూ, షహీన్​బాగ్​, జామియా ఘటనలతో అనేక మార్లు వార్తల్లో నిలిచింది దిల్లీ. వీటన్నిటికీ దూరంగా ఉండాలని ఆప్​ చాలా ప్రయత్నించింది. కానీ ఆ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేసింది. వీటినే ప్రధానాంశాలుగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బుజ్జగింపు చర్యలు చేసే ప్రభుత్వం దిల్లీ ప్రజలకు అవసరం లేదని... సీఏఏకు మద్దతిచ్చేవారే కావాలని స్పష్టం చేసింది. అలాంటివారికి అధికారంలో ఉండే హక్కు లేదని మండిపడింది. భాజపా ఊబిలో చిక్కుకుపోకుండా ఉండటానికి ఆప్​ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

మౌనం వెనుక పదునైన వ్యూహం!

దేశంలోని ప్రతి అంశంపై వామపక్షాలు-మితవాదులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. గతంలో కాంగ్రెస్​ ఆలోచనలు మధ్యస్తంగా ఉండేవి. దేశ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం నానాటికీ తగ్గిపోతున్న వేళ.. ఆప్​ ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్టికల్​ 370 నుంచి సీఏఏ వరకు, షహీన్​బాగ్​ నుంచి జామియా నిరసనల వరకు.. దేశంలోని సున్నితమైన అంశాలపై ఆప్​ మౌనానికి ఇదే కారణంగా తెలుస్తోంది.

గత నాలుగు ఎన్నికలను చూస్తే... భాజపా ఓట్లశాతం నిలకడగానే ఉంది(30-35%). కాంగ్రెస్​ మాత్రం భారీగా పతనమైంది. 2003లో 48.1గా ఉన్న ఓట్ల శాతం... 2015కు వచ్చేసరికి 9.7%కి పడిపోయింది. వీటిలో చాలా వరకు ఆప్​ ఖాతాలోనే చేరాయి. ఈసారీ పరిస్థితుల్లో మార్పు కనిపించే అవకాశం లేదు.

జాతీయవాదం పేరిట భాజపా సాగిస్తున్న ప్రచారంతో... ఆప్​కు కలిసి వచ్చే ఆస్కారముంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ డీలా పడటం వల్ల మైనారిటీ ఓట్లు కేజ్రీవాల్​కే పడొచ్చని అంచనా.

ప్రజా తీర్పునకు ప్రాధాన్యం...

ఈ నెల 11న విడుదలయ్యే ఫలితాల కోసం దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పు దిల్లీ పీఠం ఎవరిదన్న అంశానికి మాత్రమే పరిమితం కాదు. దేశ భవిష్యత్​ రాజకీయాలపై ఓ స్పష్టత ఇవ్వనుంది.

మొదటిది... ఓటర్ల ఆలోచనా శైలి. గుర్తింపు(పౌరసత్వం), అభివృద్ధికి... ఈ రెండింటిలో ప్రజలు దేనికి జైకొడతారో దిల్లీ తీర్పుతో తెలియనుంది. అది కూడా.. ఏ సందర్భాల్లో పౌరసత్వానికి ప్రాధాన్యం ఇస్తారో, అభివృద్ధికి ఎప్పుడు ఓటేస్తారో స్పష్టత వచ్చే అవకాశముంది.

రెండోది... దేశ సమాఖ్య రాజకీయ భవిష్యత్. ఒకప్పుడు దేశమంతా కాంగ్రెస్​దే రాజ్యం. అనేక దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి వచ్చింది. ఈసారి భాజపా వంతు. ఇలాంటి సమయంలో భాజపాయేతర పార్టీలు శక్తిమంతంగా ఎదిగి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఆసక్తికరాంశం. స్థానిక అంశాలతో ముడిపడిన ప్రాంతీయ పార్టీలకు ఓటర్లు జైకొడతారా లేక జాతీయ పార్టీకి మద్దతిస్తారా అన్నదానిపై దిల్లీ తీర్పుతో స్పష్టత వచ్చే ఆస్కారముంది.

ఇంతకీ హస్తిన ఓటరుగణం ఏం చేస్తుంది? తేలేది ఈనెల 11నే.

(రచయిత- డాక్టర్ కౌస్తుబ్ దేకా)

ZCZC
PRI ECO GEN NAT
.NEWDELHI PAR11
LS-DIRECT TAX BILL
FM introduces Direct Tax Vivad Se Vishwas Bill in Lok Sabha
         New Delhi, Feb 5 (PTI) Finance Minister Nirmala
Sitharaman on Wednesday introduced a bill in Lok Sabha which
seeks to provide for resolution of disputed tax cases
involving Rs 9.32 lakh crore.
         Introducing the Direct Tax Vivad Se Vishwas Bill, 2020,
the minister said this bill emphasises on trust building.
         The scheme, she said, will not be an open ended scheme
and can be availed for a limited time.
         The bill seeks to provide a formula-based solution
without any discrimination, she said.
         Giving the rationale behind the scheme, Sitharaman said
it will reduce the litigation expenditure for the government
and at the same may help in generating some revenue.
         Opposing the introduction of the bill, Congress leader
Adhir Ranjan Chowdhury said the bill's name is drafted in
Hindi and the government is trying to impose one specific
language on the country.
         At the same time it will hurt the government's tax
collection, he said.
         Echoing similar sentiments, his party colleague Shashi
Tharoor said this bill violates principle of equality by
equally treating honest and dishonest tax payers.
         In her budget speech on February 1, Sitharaman had
announced Vivad se Vishwas scheme to resolve 483,000 direct
tax disputes pending in various tribunals.
         Under the scheme, taxpayers whose tax demands are locked
in dispute in multiple forums can pay due taxes by March 31,
2020, and get complete waiver of interest and penalty. PTI JTR
DV
DV
02051334
NNNN
Last Updated : Feb 29, 2020, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.