ఉత్తరప్రదేశ్ లక్నోలోని నాగ్రమ్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. 29 మందితో ప్రయాణిస్తున్న వాహనం స్థానిక ఇందిరా కాలువలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు గల్లంతయ్యారు. మరో 22 మందిని రక్షించామని తెలిపారు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ.
బారాబంకీ జిల్లాలో పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు జిల్లా మేజిస్ట్రేట్.
" ప్రమాదంలో సుమారు 5 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు ఏడుగురు గల్లంతయ్యారు. కాలువలో ప్రవాహం అధికంగా ఉండడం వల్ల వారు కొట్టుకొనిపోయి ఉండవచ్చు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి."
- కౌశల్రాజ్ శర్మ, లఖ్నవూ జిల్లా మేజిస్ట్రేట్
ఇదీ చూడండి: నిర్లక్ష్యంతో ఇలా రైలు కింద పడ్డాడు