మహారాష్ట్ర బుల్డాాణా జిల్లాలో కరోనా వైరస్ లక్షణాలతో 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని వైద్య అధికారులు తెలిపారు. అతని నమూనాలు పరీక్షించాల్సి ఉందన్నారు.
మృతుడు సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో పాల్గొని ఫిబ్రవరి 25న భారత్ తిరిగివచ్చాడని, మార్చి 12న కరోనా అనుమానంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడని పేర్కొన్నారు.