ETV Bharat / bharat

ఆ చేతులే.. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాయ్​! - కుష్టువ్యాధిగ్రస్థులకు విజయగాథ

ఒకప్పుడు ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించని చేతులవి. కానీ ఇప్పుడు వారి చేతిలో తయారైన వస్తువులు ఖండాంతరాలు దాటుతున్నాయి. నాడు కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన జీవితాలు... నేడు కళాకాంతులతో సాగుతున్నాయి. ఇంతకు ఆ చేతులెవరివి? వారి కళ ఏంటో తెలుసుకోవాలని ఉందా..?

A successful story of lepracy sick people in Bapatla
ఆ వ్యాధి చేతులే.. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాయ్​!
author img

By

Published : Sep 7, 2020, 4:38 PM IST

ఆ వ్యాధి చేతులే.. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాయ్​!

1960లో 'సాల్వేషన్​ ఆర్మీ' సంస్థ... బాపట్లలో కుష్టువ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసేవలు అందించేది. అలా వివిధప్రాంతాల నుంచి వెయ్యి మంది వరకు రోగులు ఇక్కడకు చేరారు. కాలక్రమేణా అదే బేతని కాలనీగా మారింది. మొదట్లో వ్యాధిగ్రస్తులు, వారి పిల్లలు భిక్షాటననే ఆశ్రయించారు. ఈ పరిస్థితిలో మార్పు కోసం బేతని కాలనీ లెప్రసీ అసోషియేషన్ ఇక్కడి మహిళలు, యువతులకు చేతివృత్తుల్లో శిక్షణ ఇప్పించింది.

ఆరోగ్యం సహకరించక మొదట్లో సరిగా పనిచేయలేక పోయేవారు. ఫలితాలూ అంతగా రాలేదు. పిల్లలు అందివచ్చాక పరిస్థితి మారింది. రంగురంగుల బ్యాగులు, అందమైన దుప్పట్లు తయారీపై పట్టు సాధిస్తున్నారు. ఇప్పుడు కోటి రూపాయల మేర ఉత్పత్తులు విక్రయించే స్థాయికి చేరారు. వీరిచేతుల్లో రూపుదిద్దుకున్న వస్తువులు అమెరికా, అస్ట్రేలియా, జపాన్‌లకూ ఎగుమతి అవుతున్నాయి. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులకు ఆసరా అవుతున్నాయి.

కమ్ముకున్న చీకటిని నిందిస్తూ కూర్చోవటం కాదు.. చిరుదీపం వెలిగిస్తే అదే కొత్తబాట చూపుతుంది. అదేమాట నిజమని మరోసారి నిరూపిస్తున్నారు ఈ మహిళలంతా.

ఇదీ చూడండి: హైపర్​సోనిక్​ సాంకేతికత ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.