ఎటా జిల్లాను నేరస్థులకు అడ్డాగా పరిగణిస్తారు ఇక్కడివారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 18 పోలీసు స్టేషన్లలో రోజూ వేలల్లో కేసులు నమోదవుతుండడమే ఇందుకు కారణం. వాటిని తేల్చలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కానీ, అదే జిల్లాలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం.
ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభించి 18 ఏళ్లు దాటింది. 2001లో నిర్మితమైంది. ఇప్పటివరకు ఇక్కడ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2016లో ఓ హత్య కేసు, 2019లో రైల్వే ఉద్యోగుల మధ్య గొడవ జరిగిన కేసు నమోదయ్యాయి. ఇక్కడ 10 మంది సిబ్బంది పని చేస్తారు.
- ప్రతాప్ సింహ, స్టేషన్ ఇంఛార్జ్
నిర్మానుష్య ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడికి ప్రజలు పెద్దగా రారు. ఈ స్టేషన్ నుంచి ఆగ్రాకు ఒకే ఒక ప్యాసింజర్ రైలు ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ రైలులోనే కాపలాగా వెళతారు. ఇంకా ఇక్కడ వేరే జనాలు వచ్చే అవకాశం లేదు. అందుకే ఇక్కడి పోలీసులకు పరిమితమైన పని ఉంటుంది.
ఇదీ చూడండి:ఆసుపత్రికి వెళ్లాలంటే రోగిని 5 కి.మీ మోసుకెళ్లాల్సిందే!