అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగే 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఆత్మీయ భేటీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
హౌడీ మోదీ కార్యక్రమ వివరాలు
⦁ అమెరికా హ్యూస్టన్లో ఆదివారం రాత్రి 8.30 నుంచి 11.30 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం) హౌడీ మోదీ కార్యక్రమం జరుగుతుంది.
⦁ 'ది ఇండియన్-అమెరికన్ స్టోరీ' అనే సాంస్కృతిక కార్యక్రమంతో హౌడీ మోదీ ప్రారంభమవుతుంది. అమెరికా సంస్కృతి, మేధో, సామాజిక రంగాలకు భారతీయ అమెరికన్లు చేస్తున్న కృషిని ఇది వివరిస్తుంది.
⦁ 90 నిమిషాల ఈ సాంస్కృతిక ప్రదర్శనలో అమెరికా, టెక్సాస్లకు చెందిన 27 బృందాలు ప్రదర్శనలు ఇస్తాయి. భారతీయ-అమెరికన్ యువత గురించి 2 పాటలు ప్రదర్శిస్తారు.
'షేర్డ్ డ్రీమ్స్-బ్రైట్ ఫ్యూచర్'
⦁ హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటారు.
⦁ మొదటిసారిగా మోదీతో కలిసి సుమారు 50 వేల భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
⦁ 'షేర్డ్ డ్రీమ్స్-బ్రైట్ ఫ్యూచర్' ద్వారా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడానికి కృషి చేయనున్నారు.
మోదీ ప్రసంగం
⦁ ప్రవాస భారతీయులు సాంస్కృతికంగా, మేధోపరంగా అమెరికాకు చేస్తున్న సేవలను ప్రస్తుతిస్తారు. ప్రేక్షకుల సౌలభ్యం కోసం మోదీ ప్రసంగానికి ఆంగ్ల అనువాదం అప్పటికప్పుడే స్మార్ట్ఫోన్ల ద్వారా అందిస్తారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక బంధాల పురోభివృద్ధిపై జరగాల్సిన కృషిని గురించి ప్రసంగిస్తారు.
వర్ష సూచన
- హౌడీ మోదీ కార్యక్రమానికి వర్షం భంగం కలిగించే అవకాశముందని స్థానిక వాతావరణ విభాగం పేర్కొంది.
ఇదీ చూడండి: ప్రధాని మోదీ అగ్రరాజ్య పర్యటన సాగనుందిలా..