ETV Bharat / bharat

ఎడారి రాష్ట్రంలో 'కుంకుమ' సిరులు - Acorn tree owner Ashok Jatolia

కుంకుమ చెట్లకు కేరాఫ్​ అడ్రస్​ హిమాలయాలు. రాజస్థాన్​లో వీటి జాడ కనిపించడం దాదాపు అసాధ్యం. కానీ.. అజ్మేర్​ కుందన్​నగర్​లోని ఓ సింధూర చెట్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మొక్కలంటే అమితాసక్తి కలిగిన అశోక్​ జటోలియా ఏడేళ్ల క్రితం ఓ మొక్కను నాటాడట. అది కుంకుమ చెట్టు అని తెలిశాక.. మరింత శ్రద్ధ కనబరిచాడు. ఇప్పుడు అది వృక్షమైంది. దాదాపు అజ్మేర్​లోని అన్ని దేవాలయాల్లో ఆ చెట్టు కుంకుమే వాడుతున్నారట.

A saffron tree which grows in the Himalayas and grows in Ajmer in Rajasthan
హిమాలయాల్లో కనిపించే కుంకుమ చెట్టు.. రాజస్థాన్​లో సందడి
author img

By

Published : Oct 1, 2020, 3:40 PM IST

Updated : Oct 1, 2020, 4:50 PM IST

హిమాలయాల్లో కనిపించే కుంకుమ చెట్టు.. రాజస్థాన్​లో సందడి

సాధారణంగా హిమాలయాల్లో పెరిగే కుంకుమచెట్టు.. రాజస్థాన్లో అరుదుగా కనిపిస్తుంది. అజ్మేర్ వాసి అశోక్ జటోలియా ఇంట్లో అలాంటి ఓ చెట్టు ఉంది. అది స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. చెట్టు నుంచి సహజమైన కుంకుమ తీసుకోవడం కోసం స్థానికులు ఎంతోమంది వస్తున్నారు.

కుందన్​ నగర్​లో 'కలీమా'

కుంకుమ సహజంగా చెట్ల నుంచి వస్తుందని చాలా తక్కువమందికి తెలుసు. ఇంగ్లీషులో కుంకుమ చెట్టును కలీమా అంటారు. పర్వత ప్రాంతాల్లోనే పెరిగే ఈ చెట్టు.. ఇప్పుడు కుందన్​ నగర్​లో సందడి చేస్తోంది. స్థానికులు దానిని పవిత్రంగా పూజిస్తూ ఈ చెట్టు పండ్లు తమతో తీసుకెళ్తారు.

"సింధూరచెట్టును ఏడేళ్ల క్రితం భోపాల్ నుంచి తెచ్చాను. మొదట 2, 3 ఏళ్లు కుండీలో ఉంచాను. తర్వాత భూమిలో నాటాను. దీన్నందరూ పవిత్రంగా భావించి కుంకుమ తీసుకెళ్లి, వాడుకుంటారు."

- అశోక్ జటోలియా, చెట్టు యజమాని

అజ్మేర్​లోని అన్ని ఆలయాలకూ..

అశోక్ జటోలియాకు మొక్కల పెంపకమంటే ఆసక్తి. అప్పట్లో ఎంతోమందిని అడిగాక గానీ అది కుంకుమ చెట్టని తెలియలేదు. తెలిశాక దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాలాజీ, గణేషుడి పూజ కోసం చెట్టు నుంచి పండ్లు తీసుకెళ్తారు. అశోక్ భార్య సునీత.. అజ్మేర్​లోని దాదాపు అన్ని ఆలయాలు తమ చెట్టు నుంచి కుంకుమ తీసుకెళ్లాయని చెబుతున్నారు. మార్కెట్లో దొరికే కుంకుమ.. ఎరుపురంగులో, రసాయనాలతో కూడి ఉంటుందనీ, సింధూర వర్ణంలో ఉండే చెట్టు కుంకుమ వల్ల ఎలాంటి హానీ ఉండదనీ అంటున్నారు.

"వేరే కుంకుమలో రసాయనాలు ఉంటాయి. పాపిడలో పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది. సహజసిద్ధ కుంకుమతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. 2, 3రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు."

- సునీతా జటోలియా, అశోక్ భార్య

స్థానికులు హర్షం

ఇంట్లోని కుంకుమ వృక్షాన్ని ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటున్న జాటోలియా కుటుంబం అడిగిన వారందరికీ ఉచితంగానే కుంకుమ ఇస్తున్నారు. తమ ప్రాంతంలోనే సహజమైన కుంకుమ లభిస్తుండటం వల్ల స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"హనుమంతుడికి పెట్టే సింధూరం లాగే ఉంటుంది ఈ కుంకుమ. పూర్తిగా సహజసిద్ధం, పరిశుద్ధం. ఇది ఎంతో పవిత్రమైన చెట్టు."

- శంకర్, స్థానికుడు

ఏడేళ్ల క్రితం కుంకుమ చెట్టు గురించి ఎవరికీ తెలియదు. ఇతర సాధారణ చెట్లలాగే అశోక్ జటోలియా ఈ మొక్కనూ తోటలో నాటాడు. అదే మొక్క ఇప్పుడు చెట్టై కుంకుమ ఇస్తోంది.

ఇదీ చూడండి: గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?

Last Updated : Oct 1, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.