ETV Bharat / bharat

జనాభా లెక్కల్లో కొత్త చిక్కు - పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)

జనాభా లెక్కల సేకరణకు ప్రజలు తగిన సమాచారం ఇవ్వకపోతే స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) లెక్కింపు కూడా గందరగోళంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు నిపుణులు. సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీలపై అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎంత వరకు సమాచారం ఇస్తారన్నది సందేహంగా మారింది.

A new implication in the census
జనాభా లెక్కల్లో కొత్త చిక్కు
author img

By

Published : Mar 3, 2020, 8:34 AM IST

జనాభా లెక్కల సేకరణకు కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రజలు తగిన సమాచారం ఇవ్వకపోతే స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) లెక్కింపు కూడా గందరగోళంగా మారుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగనుండగా, అందులో భాగంగా తొలుత రానున్న ఏప్రిల్‌/మే నెలల్లో ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. జనాభా లెక్కల సేకరణతో పాటుగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటం వల్ల ఇందులో పాల్గొన్న వారు ఎంతవరకు పూర్తి సమాచారం ఇస్తారన్నది సందేహాస్పదంగా మారింది.

ఈ విషయంపైనే ఆర్థిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "జీడీపీ లెక్కింపులో సగ భాగం సర్వేల ఆధారంగా జరుగుతుంది. దేశంలో 68% మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరి సమగ్ర సమాచారం లేకపోతే జీడీపీ లెక్కింపు కష్టమవుతుంది" అని పేర్కొన్నారు. కుటుంబ వివరాలను అందించకపోతే ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతాయని జాతీయ గణాంక కమిషన్‌ మాజీ చైర్మన్‌ ప్రొణబ్‌ సేన్‌ అభిప్రాయపడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌.. సమస్యను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:అనాథ జంతువులంటే ప్రాణం.. ఆయన ఇల్లే ఆవాసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.