కర్ణాటకలోని చారిత్రక హంపి కొండలో రెండు బండల సందులో చిక్కుకుని ఓ మందుబాబు నాలుగు గంటలపాటు నానాయాతన పడ్డాడు.
'శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంఘం'... బళ్లారి జిల్లా హోసపేట తాలూకాలోని హంపి గణేశ విగ్రహం వెనుక ఉన్న శివరామ అధూతర మఠంలో 'మద్య నిషేధ శిబిరం' నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన కొప్పల్ జిల్లా హులిగి గ్రామానికి చెందిన దేవేంద్ర ఆ శిబిరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
ఆ ప్రయత్నంలో భాగంగా హంపి కొండపై ఉన్న రాళ్ల మధ్యన చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి బాధితుణ్ని రక్షించారు.
ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న బాధితుడు దేవేంద్ర ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి: ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్ప్రెస్