ఉల్లి ధర ఘాటు దేశవ్యాప్తంగా ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే ఉల్లిపాయలు ఇచ్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓ యువకుడు హల్చల్ సృష్టించాడు. ఉల్లిపాయలు విక్రయిస్తున్న సేవాదళ్ సభ్యుడి వేలును కొరికేశాడు.
ఇదీ జరిగింది..
ఉల్లి ధరలు పెరగటం వల్ల జిల్లాలోని హల్ద్వానిలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఉల్లిపాయల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఓ యువకుడు స్టాల్ వద్దకు వచ్చాడు. కానీ.. అప్పటికే ఉల్లిపాయలు అయిపోయాయని విక్రయదారులు చేప్పారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తి చేసిన ఆ యువకుడు అక్కడ హల్చల్ సృష్టించాడు. స్టాల్లో ఉన్న కాంగ్రెస్ సేవాదళ్ సభ్యుడి వేలును కొరికేశాడు. వేలు తెగి కిందపడిపోయింది.
ఆ యువకుడిని సేవదళ్ సభ్యులు పట్టుకుని చితకబాదారు. అతను భాజపాకు చెందిన వ్యక్తిగా ఆరోపించారు.
ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల్ని ఎన్కౌంటర్ చేయంది అందుకే!