ETV Bharat / bharat

కుమారుడు పుట్టాలని కుమార్తెను బలిచ్చిన తండ్రి - father killed daughter for son

tamilnadu
కుమారుడు పుట్టాలని కుమార్తెను బలిచ్చిన తండ్రి
author img

By

Published : Jun 2, 2020, 3:07 PM IST

Updated : Jun 2, 2020, 3:58 PM IST

15:20 June 02

ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మూఢనమ్మకాలు అక్కడక్కడా ఉనికి చాటుతూనే ఉన్నాయి. కుమారుడు పుట్టాలనే వాంఛతో క్షుద్రపూజల పేరుతో 13ఏళ్ల కన్నకూతురినే బలిచ్చాడు ఓ కసాయి తండ్రి.  

తమిళనాడు పుదుకుట్టై జిల్లా కందర్వకొట్టైలో.. చాలా ఏళ్లుగా మగసంతానం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ పెద్ద.. ఓ జ్యోతిషుడి మాటలు విని తమ కుమార్తెను బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంటి ఆవరణలోని బావిలో నీళ్లు తోడుతున్న బాలికను చంపేశాడు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు హంతకుడి కోసం గాలించారు. అయితే కన్న తండ్రే ఆ బాలికను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దుస్సాహసానికి ఒడి గట్టిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. కుమార్తెను చంపాలని సలహా ఇచ్చిన జ్యోతిషుడి కోసం గాలిస్తున్నారు.

15:06 June 02

కొడుకు పుట్టాలనే వాంఛతో కూతురిని బలిచ్చిన తండ్రి!

తమిళనాడులోని పుదుకుట్టైలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ జోస్యుడి మాటలు విని 13ఏళ్ల సొంత కూతురిని బలి ఇచ్చాడు ఓ కసాయి తండ్రి. కొడుకు పుట్టాలనే వాంఛతో సదరు వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Last Updated : Jun 2, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.