కర్ణాటక మైసూర్లో ఓ చిరుత పులి.. నీళ్లు లేని బావిలో పడిపోయింది. మూడు రోజులు శ్రమించి సీసీటీవీ ద్వారా గుర్తించి చిరుతను బయటకు తీశారు అటవీశాఖ అధికారులు.

మైసూర్, హెచ్డీ కోటే తాలూకా, కారపుర గ్రామంలో ఓ చిరుత కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. చిరుత కోసం అధికారులు రెండు రోజులు తీవ్రంగా గాలించారు. అది బావిలో పడిందని తెలుసుకున్నారు. బావి దగ్గరకు వెళ్లి.. చిరుత కోసం వెతికారు కానీ కనిపించలేదు.


బావిలో నిచ్చెన వేసి ఓ అధికారిని బోన్లో కూర్చోబెట్టి మరీ కిందికి పంపి.. చిరుత జాడను కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేదు. చివరిగా సీసీ కెమెరాను ఓ తాడుకు కట్టి.. బావిలోకి వదిలారు. ఓ సందులో దాక్కున్న చిరుతను సీసీటీవీ మానిటర్లో గమనించారు అధికారులు. ఆపై వలవేసి జాగ్రత్తగా బయటకుతీశారు.




ఇదీ చదవండి: దారి తప్పింది... దాడికి దిగింది..