ETV Bharat / bharat

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఏడు కీలక ఒప్పందాలు - ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​ల మధ్య గురువారం జరిగిన వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలను పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకునేందుకు వీలుగా కీలక రక్షణ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

A key defense agreement between India and Australia
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం
author img

By

Published : Jun 5, 2020, 6:42 AM IST

సైనిక స్థావరాలను పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకునేందుకు భారత్‌, ఆస్ట్రేలియాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి మరో ఆరు ఒప్పందాలను ఖరారు చేసుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ల మధ్య గురువారం వర్చువల్‌ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సందర్భంగా ఈ కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని, ఇది భారత్‌-పసిఫిక్‌కు, ప్రపంచానికి ముఖ్యమని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.

రక్షణ బంధం

ఒక విదేశీ నేతతో వర్చువల్‌ సమావేశాన్ని మోదీ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాలకూ చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా కుదిరిన 'ద మ్యూచువల్‌ లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్' (ఎంఎల్‌ఎస్‌ఏ) ఒప్పందం కింద.. భారత్‌, ఆస్ట్రేలియాలు పరస్పరం సైనిక స్థావరాలు, మరమ్మతు కేంద్రాలు, సరకు సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.

అంతర్జాతీయ మహమ్మారులపై సమర్థంగా స్పందించడానికి, వాటి నివారణకు వీలుగా శాస్త్ర, వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి ఫలాలను పంచుకోవాలని, ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని భారత్‌, ఆస్ట్రేలియాలు నిర్ణయించాయి. కరోనా చికిత్సకు వినూత్న విధానాలను రూపొందించేలా 'ఆస్ట్రేలియా-భారత్‌ వ్యూహాత్మక పరిశోధన నిధి'లో కొత్త దశను ప్రారంభించాలని నిర్ణయించాయి.

అవకాశంగా భావిస్తున్నాం: మోదీ

కరోనా మహమ్మారి వల్ల కలిగిన ఆర్థిక, సామాజిక నష్టాల నుంచి బయటపడేందుకు సమన్వయంతో కూడిన భాగస్వామ్యం అవసరమని మోదీ పేర్కొన్నారు. 'కష్ట కాలం'లో ఆస్ట్రేలియాలోని భారతీయులను.. ముఖ్యంగా విద్యార్థులను మోరిసన్‌ సంరక్షించారని మోదీ కొనియాడారు.

మోదీ నాయకత్వం భేష్‌: మోరిసన్‌

మోరిసన్‌ మాట్లాడుతూ.. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో సంక్లిష్ట సమయంల్లో మోదీ చాలా నిర్మాణాత్మక, సానుకూల పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు. "భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ, సమ్మిళితత్వం, సుసంపన్నత నెలకొనాలన్నదే మా ఆకాంక్ష. ఇక్కడ భారత పాత్ర కీలకం కానుంది" అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా తన సైనిక సత్తాను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్‌పీ) ద్వారా ఇది మరింత వృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో గ్యాస్‌ లీకై చనిపోయినవారికి, భారత్‌లో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు.

సమోసా-కిచిడి

భేటీ చివర్లో మోదీ, మోరిసన్‌ల మధ్య సరదా సంభాషణ సాగింది. ఈ సదస్సుకు కొన్ని రోజుల ముందు సమోసాలు, మామిడికాయ చట్నీని స్వయంగా తయారుచేసి, ట్విటర్‌లో ఫొటోలు పెట్టిన మోరిసన్‌.. తదుపరి శిఖరాగ్ర భేటీ నాటికి గుజరాతీ కిచిడీని తయారుచేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా తెలిపారు. తాను భారత్‌ను సందర్శించి ఉంటే మోదీ మార్కు ఆత్మీయ ఆలింగనాన్ని పొంది ఉండేవాడినని, ఆయనతో కలిసి సమోసాలు ఆస్వాదించేవాడినని తెలిపారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. "మీరు చేసిన సమోసాలు భారత్‌లో చర్చనీయాంశమయ్యాయి. మీరు కిచిడీని ప్రస్తావించడం వల్ల గుజరాతీయులు సంతోషిస్తారు. అది భారత్‌లో చాలా సాధారణ వంటకం. దేశంలో దాన్ని అనేక పేర్లతో పిలుస్తుంటారు" అని చెప్పారు.

సంయుక్త ప్రకటన..

  • భారత సంస్థల ఆఫ్‌షోర్‌ ఆదాయంపై పన్ను అంశాన్ని 'భారత్‌-ఆస్ట్రేలియా ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందా'నికి అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునే అంశంపై చర్చ.
  • ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ)పై మళ్లీ చర్చలు జరపాలి.
  • ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం పొందేలా భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుంది. పౌర అణుశక్తి రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయం.
  • వ్యవసాయ రంగంలో కలిసి పనిచేయాలి. పంట కోతల తర్వాత నష్టాలు తగ్గించడానికి, ఖర్చుల హేతుబద్ధీకరణ విషయంలో భాగస్వామ్యానికి అవకాశాలను పరిశీలించాలి.
  • భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించేలా నిబంధనలు, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా నడిచే పరిస్థితులు ఉండాలంటూ రెండు దేశాలూ ప్రత్యేకంగా ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత, సుసంపన్నతను పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నట్లు అందులో పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధికి భారత్​ భారీ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.