ETV Bharat / bharat

కుబేరుడైన ఉల్లి రైతు- సీజన్​ ఆదాయం రూ.2.4 కోట్లు - ఉల్లి రైతు 'పంట పండింది'.. రెండున్న కోట్ల ఆదాయం వచ్చింది

కొనేవారికి, కోసేవారికి కన్నీళ్లు పెట్టిస్తున్నా... సాగు చేసేవారి కంట మాత్రం ఆనంద బాష్పాలు తెప్పిస్తోంది 'ఉల్లి'. అవును, సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్న ఉల్లి  ధరలే.. ఇప్పుడు కర్ణాటకలో 10 ఎకరాల భూమి ఉన్న ఓ  సాధారణ రైతును కోటీశ్వరుడ్ని చేశాయి. కేవలం రూ.15 లక్షల పెట్టుబడి పెట్టి రెండున్నర కోట్లు సంపాదించాడు ఆ కర్షకుడు.  అదెలా సాధ్యమంటారా..? అయితే ఈ కథనం చూడాల్సిందే.

a Karnataka farmer became crorepati even after repaying all his debt because of bumper onion production in chitradurga
ఉల్లి రైతు 'పంట పండింది'.. రెండున్న కోట్ల ఆదాయం వచ్చింది!
author img

By

Published : Dec 16, 2019, 2:34 PM IST

Updated : Dec 16, 2019, 5:04 PM IST

కుబేరుడైన ఉల్లి రైతు- సీజన్​ ఆదాయం రూ.2.4 కోట్లు

ఓ వైపు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతుంటే... మరో వైపు కర్ణాటక చిత్రదుర్గకు చెందిన మల్లికార్జున మాత్రం ఉల్లి ధరలు పెరగడం వల్లే కోట్లకు అధిపతి అయ్యాడు. తన పొలంలో ఉల్లి సాగు చేసి 240 టన్నుల దిగుబడి పొందాడు. ఏకంగా 2 కోట్ల 40 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించాడు.

కష్టానికి.. అదృష్టం తోడైతే?

మల్లికార్జునకు సొంతంగా ఉన్న 10 ఎకరాల భూమితో పాటు.. మరో పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 2004 నుంచి ఏటా వర్షాకాల ఆరంభంలోనే ఆ 20 ఎకరాల భూమిలో ఉల్లి సాగు చేస్తున్నాడు. ఈ సారి ఎప్పటిలాగే ఉల్లి పంట వేశాడు. రూ. 20 లక్షల రూపాయల అప్పు చేసి మరీ రూ.15 లక్షలు కేవలం ఉల్లిపైనే పెట్టుబడి పెట్టాడు.

గతేడాది రూ.5 లక్షల లాభం వచ్చింది కనుక ఈ సారీ.. అప్పులన్నీ తీరిపోయి, 5 నుంచి 10 లక్షల రూపాయలు లాభం వస్తుందని ఊహించాడు. 50 మంది కూలీలను పెట్టి ఉల్లి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అదృష్టం బాగుండి... 240 టన్నులు దిగుబడి వచ్చింది.

మార్కెట్​లో ఉన్న రేటు కన్నా కాస్త తక్కువగానే విక్రయించాలని అనుకున్న రైతు, ఒక్క కిలోకు రూ.100 ధర ఖరారు చేశాడు. ఇంకేముందీ.. మల్లికార్జున కలలో కూడా ఊహించని విధంగా అతని ఆదాయం 2 కోట్ల 40 లక్షల రూపాయలు దాటిపోయింది. ఇలా, ఒకరిని ఏడిపిస్తూ.. మరొకరి ముఖంలో చిరునవ్వులు తెప్పిస్తూ చమత్కారాలు చేస్తోందీ ఉల్లి మహాతల్లి.

ఇదీ చదవండి:'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'

Mumbai, Dec 15 (ANI): Bollywood celebrities attended a party organised by publicist Rohini Iyer in Mumbai. Bollywood actor Deepika Padukone attended the party with sister Anisha. Deepika looked every bit of gorgeous in a black dress. Actor Aditi Rao Hydari also marked her presence in a chic tube top and flared jeans. The star-cast of 'Pati Patni Aur Woh' also attended the event. Kartik Aaryan, Ananya Panday and Bhumi Pednekar looked cute together. The trio is currently enjoying the success of their recent flick.

Last Updated : Dec 16, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.