సాధారణంగా మనం ఇటుక, ఇసుక, సిమెంట్‌తో ఇంటిని నిర్మించుకుంటాం. దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తనదైన పరిష్కారాన్ని చూపిస్తూ ప్లాస్టిక్ సీసాలతో తన కలల ఇంటిని నిర్మించుకున్నాడు నితిన్ ఉజ్గావకర్. ఇందుకోసం సుమారు 20వేల ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించాడు.
మహారాష్ట్ర అమవరాతిలోని 'సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం' సమీపంలోని దస్తూర్నగర్లో ఈ ఇల్లు ఉంది. వాడిపడేసిన సీసాలతో నిర్మాణాలు చేపడితే ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాస్టిక్ సంక్షోభానికి పరిష్కారం దొరికినట్లేనని అంటున్నాడు నితిన్. ఖర్చు కూడా 30 నుంచి 40 శాతం తగ్గుతుందని చెబుతున్నాడు.
"ఒకసారి రోడ్డుపై వెళుతున్నప్పుడు 20,30 ప్లాస్టిక్ సీసాలను చూశాను. వీటిని ఎలా రీసైకిల్ చేయాలని ఆలోచించాను. ఇందుకోసం ఇంటర్నెట్లో వెతికితే చాలా ఉపాయాలు దొరికాయి. ఇల్లు నిర్మించటం మంచి ఆలోచనగా అనిపించింది.
ఈ విషయం ఇంట్లో వారికి, కార్మికులకు చెప్పినప్పుడు వాళ్లు ఆశ్చర్యపోయారు. పిచ్చి పట్టిందా అని అడిగారు. ప్లాస్టిక్‌తో నిర్మించగలనని నామీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గోడలను నిర్మించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాను."
-నితిన్ ఉజ్గావకర్
ఇదీ చూడండి : ఆలోచన అదుర్స్... ప్లాస్టిక్ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ