ETV Bharat / bharat

ఆత్మహత్య కేసుల్లో సీబీఐ ట్రాక్​రికార్డు తెలుసా? - స్టెర్లింగ్​ బయోటెక్​ స్కామ్:

సీబీఐకి భారత్​లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అవినీతి నుంచి హత్య కేసుల వరకు ఈ సంస్థనే రంగంలోకి దించాలని అందరూ కోరుతుంటారు. తాజాగా బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసును కూడా సీబీఐకే అప్పగించారు. ఈ నేపథ్యంలో సంస్థ ట్రాక్​ రికార్డును ఓసారి పరిశీలిద్దాం..

A glimpse at the rise and fall of the premier crime investigating agency CBI
ఆత్మహత్య కేసుల్లో సీబీఐ ట్రాక్​రికార్డు తెలుసా?
author img

By

Published : Aug 24, 2020, 5:13 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసును.. సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు అప్పగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే దర్యాప్తుల్లో కీలకంగా మారిన ఈ సంస్థకు గతంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. ప్రజలే ఈ సంస్థ విలువలు, ఫలితాలను ప్రశ్నించారు. అయితే ఎన్ని ఆటంకాలు, విమర్శలు వచ్చినా ఇప్పటికీ కచ్చితమైన దర్యాప్తు, కేసుల్లో నిజాలను నిగ్గుతేల్చేందుకు.. సీబీఐ విచారణ అవసరం అనేది ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఉన్న నమ్మకం.

"సీబీఐ ఎన్నో ఉత్థానపతనాలు ఎదుర్కొంది. నేను దాదాపు 10ఏళ్లు ఈ సంస్థకు సేవలందించాను. నా కెరీర్​లో సెయింట్ కిట్స్ ఫోర్జరీస్ కేసు సహా ఎన్నో అవినీతి కేసులను డీల్​ చేశాను. సంస్థపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఒక్కోసారి మంచి చేయడంలో విఫలమైనా.. మంచి చేసిన వాటికి మాత్రం సీబీఐ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఏ కేసును దర్యాప్తు చేయాలన్నా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్​ తీసుకోవాల్సి వస్తోంది. గతంలో అలా ఉండేది కాదు. ఇది సంస్థ స్వయం ప్రతిపత్తికి ఆటంకంగా మారింది. అయినప్పటికీ ప్రజలకు సీబీఐపై నమ్మకం మాత్రం అలానే ఉంది".

-- ఎన్​కే సింగ్​, సీబీఐ మాజీ జాయింట్​ డైరెక్టర్​.

"సీబీఐ పనిలో రాజకీయ జోక్యం సరైనది కాదు. సంస్థ పర్యవేక్షణ, ఆర్థిక సహాయం అందించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. ఇటీవలే చేసిన మార్పులు దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ స్వతంత్ర పనితీరుకు అనుకూలంగా లేవు" అని సింగ్​ అన్నారు. ఈ మాజీ అధికారి 1977, అక్టోబర్​ 2లో ఓ కేసులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.

సీబీఐ అనేది అవినీతి నుంచి హత్య కేసుల వరకు దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన ఏజెన్సీ. భారత్​లో బాగా చర్చనీయాంశమైన కేసు గానీ, ఏదైనా ప్రముఖ కుంభకోణాల అంతుతేల్చే పని సీబీఐకి అప్పగిస్తుంటారు. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంచలన అత్యాచార కేసులు, బ్యాంక్​ మోసాలు ఉన్నాయి. ఎంతో పేరున్న ఈ సంస్థ చేపట్టిన కేసులు ఎక్కువగా పరిష్కారం కాకుండానే ఉండటం మైనస్​ పాయింట్​. సీబీఐ విజయాలు, వైఫల్యాలు ఇలా...

సీబీఐ స్వీకరించిన పలు సంచలన కేసులు..

స్టెర్లింగ్​ బయోటెక్​ స్కామ్:

గుజరాత్​లోని వడోదరకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్​ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. సంస్థ ప్రమోటర్లు నితిన్ సందేశరా, చేతన్ సందేశరా, దీప్తి సందేశరా కలిసి వివిధ బ్యాంకుల్లో రూ.5,700 కోట్ల రుణ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సీబీఐ సేకరించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో దేశీయంగా 249, విదేశాల్లో 96 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది. అయితే ఆయా డొల్ల కంపెనీలకు చెల్లింపులు చేసినట్లు పేర్కొంటూ.. లావాదేవీలు జరిపిన వివరాలతో డైరీలను 2011 జనవరిలో స్వాధీనం చేసుకుంది సీబీఐ.

విజయ్​ మాల్యా కేసు:

లిక్కర్​ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసును దర్యాప్తు చేసింది సీబీఐ. 2016లో భారత్​ నుంచి యూకేకు పారిపోయారు మాల్యా. ఆయన రూ. 9వేల కోట్ల రుణాన్ని బ్యాంక్​లకు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అద్భుతమైన పురోగతి సాధించినా.. మాల్యా స్వదేశానికి తెచ్చేందుకు ఇంకా కృషి చేస్తూనే ఉంది.

అగస్టా వెస్ట్​లాండ్​​ స్కామ్​:

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కుంభకోణాన్ని సీబీఐ డీల్​ చేసింది. దాదాపు రూ. 3600కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు పలువురు మధ్యవర్తులు, రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చాయి. ఇటలీకి చెందిన డిఫెన్స్​ పరికరాల తయారీ సంస్థ ఫిన్​మోకానికా నుంచి వారికి కొంత లంచం ముట్టిందని అభియోగాలు నమోదు చేసింది.

శారదా స్కామ్​:

2013లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ స్కీమ్​ల ద్వారా లక్షల మంది పెట్టుబడిదారులను మోసం చేస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఛార్జ్​సీటు​ దాఖలు చేసిన సీబీఐ.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సతీమణి నళినికి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు పేర్కొంది.

సీబీఐ వైఫల్యాలు..

ఎన్నో అవినీతి కుంభకోణాలను ఛేదించిన సీబీఐ... 2జీ స్పెక్ట్రం నుంచి చర్చనీయాంశమైన ఆరుషీ హత్య కేసు వరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. సరైన ఆధారాలు సమర్పించలేక సుప్రీంకోర్టు నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్రం కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. దాదాపు నాలుగు అంశాలపై ఛార్జ్​షీటులను దాఖలు చేసింది. వేల కొద్దీ పేజీల్లో కేసు వివరాలు సేకరించినా.. అందుకు తగ్గ ఒక్క బలమైన ఆధారాన్ని సంపాదించలేకపోయింది.

ఈ ఏడాది మార్చిలో ఓ న్యూస్​ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2015, జనవరి 1 నుంచి 2020 ఫిబ్రవరి 29 కాలంలో సీబీఐ 4,985 కేసులు నమోదు చేసింది. ఇందులో 4,300 కేసులు సాధారణమైనవి కాగా.. 685 ప్రిలిమినరీ విచారణ చేపట్టాల్సినవే. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి సంఖ్య 4,717(3987+730)గా ఉంది. వాటిల్లో దాదాపు 3,700 కేసుల్లో ఛార్జ్​షీటులు​ దాఖలు చేసింది సీబీఐ.

ఆత్మహత్య కేసుల్లో జీరో...!

ప్రపంచంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థల్లో ఒకటిగా పేరున్న సీబీఐ ఇన్ని డీల్​ చేసినా.. 65-70 శాతం కేసులకే శిక్షపడేలా చేయగలుగుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇక ఆత్మహత్యల కేసుల్లో అయితే ట్రాక్​ రికార్డు అంతగా ఏమీ లేదని.. ఒక్క కేసుకు సరైన ముగింపు ఇవ్వలేకపోయిందని అందులో పేర్కొన్నారు.

సీబీఐ ఇప్పటివరకు కొన్ని ఆత్మహత్య కేసులను విచారించింది. కానీ వాటిలో నిందితుల కారణంగానే బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని నిరూపించలేకపోయింది.

బాలీవుడ్​ నటుడు సుశాంత్ కేసుకు ముందు నటి జియా ఖాన్​ మరణంపై సీబీఐ దర్యాప్తు చేసింది. ఇందులో నటుడు సూరజ్ పంచోలి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని అభియోగాలు మోపింది. ఇందులో భాగంగా ఛార్జిషీటు​నూ దాఖలు చేసింది. కానీ 2017 నుంచి ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.