దేశవ్యాప్తంగా బిహార్ వరదల అంశం చర్చనీయాంశమైన తరుణంలో అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ వర్షాలకు బిహార్ రాజధాని పట్నాలో దాదాపు అన్ని రోడ్లు జలమయమైన వేళ... ఈ యువతి మాత్రం అదే వరద నీటి మధ్య నిలబడి ఫొటోషూట్ చేసింది. ఇప్పుడు ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఫొటోషూట్ వెనుక అసలు కారణం...
అదితి సింగ్... ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని. తన వృత్తి ద్వారా పట్నాలోని తాజా పరిస్థితులను చూపించాలనుకుంది. అందుకే ఇలా ఫొటోషూట్ చేసింది.
అదితి ఫొటోలపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఈ వినూత్న ఆలోచనను అభినందిస్తుంటే.. మరికొందరు ఫొటోషూట్‌ను వ్యతిరేకిస్తూ యువతిని ట్రోల్ చేస్తున్నారు.