ఈశాన్య దిల్లీలోని సీలంపుర్లో సోమవారం రాత్రి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ యువతి ఉంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు సమాచారం.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసింది అగ్నిమాపక సిబ్బంది.
నిర్మాణ దశలో ఉన్న భవనం కింద ఓ వేడుక జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఇదీ చూడండి:- మోదీకి 'గేట్స్' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్