'భాజపా, శివసేనకు చెరో రెండున్నరేళ్లు అధికారం.. ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి..' ఇది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన మాట. సీట్ల పరంగా అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే శివసేన మద్దతు తప్పనిసరి. ఇలాంటి తరుణంలో భాజపా ఎటూ తేల్చుకోని సందిగ్ధ స్థితిలో ఉంది.
ఇలాంటి సమయంలో సాక్షాత్తు ఠాక్రే నివాసం ఎదుట ఓ ఫ్లెక్సీ ప్రత్యక్షమైంది. 'ఆదిత్య ఠాక్రే... మహారాష్ట్ర సీఎం' అంటూ ఫ్లెక్సీపై రాసి ఉంది. అయితే ఠాక్రేల నివాసమైన మాతోశ్రీ ముందు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సేన డిమాండ్‌కు బలం చేకూర్చుతోంది.
288 స్థానాలున్న మరాఠా అసెంబ్లీలో భాజపా 105 స్థానాలు సాధించింది. శివసేన 56 స్థానాల్లో జెండా ఎగరేసింది. ఈ నేపథ్యంలో మెజారిటీ కోసం ఇరు పార్టీలు కలిసి నడవక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: ఆసక్తి : భాజపాపై శివసేన పరోక్ష విమర్శలు!