కేరళ అగ్నిప్రమాద ఘటనపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగింది. భాజపా, కాంగ్రెస్ వర్గాలు సచివాలయం వెలుపల నిరసన ప్రదర్శనకు దిగాయి.
మంటలు ప్రమాదవశాత్తు వ్యాపించలేదని బంగారం అక్రమ రవాణా(గోల్డ్ స్మగ్లింగ్)కు సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకే ఈ కుట్రపన్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆరోపించారు.
"గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మంత్రి కేటీ జలీల్‌కు సంబంధించి ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న పత్రాలను కావాలనే తగులబట్టారు. నిజాన్ని బయటపెట్టేందుకు మేం సచివాలయానికి వెళ్తే నన్ను, భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు."
-కే సురేంద్రన్, భాజపా అధ్యక్షుడు
కాంగ్రెస్
ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల అభిప్రాయం వ్యక్తం చేశారు.
"బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు పూర్తిగా నాశనమయ్యాయి. దీనికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాధ్యత వహించాలి."
-రమేష్ చెన్నితల, కాంగ్రెస్ నేత
అగ్నిప్రమాద ఘటనపై కేరళ గవర్నర్‌ను కలిశారు రమేష్. తమ అనుమానాలను గవర్నర్‌కు వివరించారు.