దేశంలో వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి కార్యాలయ విభాగంలో వైరస్ కేసులు నమోదవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైరస్‌పై మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సలహాలను తప్పనిసరిగా పాటించాలని ఉద్యోగులందరికీ వీడియో సందేశం పంపారు సెయిల్ ఛైర్మన్ ఏకే చౌదరి. కార్యాలయాన్ని రెండురోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.
దశల వారీగా కార్యలయ పనులు పునః ప్రారంభమవుతాయని చెప్పిన సంస్థ... శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి అవసరమైన భద్రతా చర్యలను కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు మ్యాక్స్, అపోలో వంటి ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదీ చదవండి: 'ఇండియా పేరు మార్పుపై ఆదేశాలివ్వలేం'