ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం తరఫు న్యాయవాది దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు దిల్లీ కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మధ్యంతర బెయిల్ పిటిషన్ను విచారించనున్నారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు.
మరోవైపు ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. నిజానికి నిన్ననే కస్టడీ ముగియాల్సి ఉంది. కస్టడీని దిగువ కోర్టు నేటికి పొడిగించింది. నిన్నటితో 3 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరాన్ని దిల్లీ కోర్టు ముందు హాజరు పరిచారు సీబీఐ అధికారులు.
యూపీఏ సర్కారు హయాంలో విదేశీ నిధులను ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించేందుకు సహకరించారన్న ఆరోపణలతో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు.
ఇదీ చూడండి:- ఎయిర్సెల్ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి